Rice Water For Hair: ప్రతి రోజు మన వంటింట్లో లభించే గంజి లేదా రైస్ వాటర్‌తో ఉన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కేశ సౌందర్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి షాంపూలు,ఆయిల్స్ అవసరం లేకుండానే ఇవి జుట్టును మెరిసేలా చేస్తాయి. జుట్టుకు గంజిని వాడటం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉంటాయి.
బియ్యం కడిగిన నీళ్లలోని పోషక విలువలు జుట్టు పెరుగుదలను రెట్టింపు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .జుట్టు పెరుగుదలకు రైస్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమ్మమ్మల కాలంలో నుంచి కూడా జుట్టుకు దీనిని నుంచి ఉపయోగించేవారు.
మెరిసే కురులు:
రైస్ వాటర్ వెంట్రుకలకు సహజమైన మెరుపును ఇస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ వెంట్రుకలకు రక్షణ పొరను ఏర్పాటు చేస్తాయి. ఫలితాలు జుట్టు అందంగా, ఆకర్షనీయంగా కనిపిస్తుంది.
కుదుళ్లకు బలం:
బియ్యం కడిగిన నీళ్లలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు చక్కటి పోషణను అందిస్తాయి. కుదుళ్ల నుంచి బలాన్ని చేకూర్చి వెంట్రుకలు రాలకుండా కాపాడుతాయి. కుదుళ్లకు అవసరమైన, సహజమైన పీహెచ్ లెవెల్స్ ని అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి.
మృదువైన జుట్టు:
జుట్టుకు రైస్ వాటర్ ఉపయోగించడం వల్ల పట్టులాగా, మృదువుగా మారుతుంది. అంతేకాకుండా చాలామందికి వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతుంటాయి. అలాంటి జుట్టుకు బియ్యం కడిగిన నీటిలో ఉండే పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్లు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచుగా జుట్టుకు రైస్ వాటర్ పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పెరుగుదల కనిపిస్తుంది.
దురదకు చెక్:
చాలా మందిని తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య దురద. చెమట, చుండ్రు వంటి వాటి వల్ల తలలో దురద వస్తుంటుంది. అలాంటి వారికి రైస్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో తలలో ఉన్న దురదను తగ్గించే పోషకాలు అధికంగా ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్లు తరచుగా తలకు పట్టించడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. అంతే కాకుండా జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. ఫలితంగా మీరు నచ్చినట్టుగా.. ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు.
Also Read: మారుతున్న జీవన విధానం.. వ్యాధుల బారిన పడుతున్న జనం
తయారీ విధానం..
ముందుగా సగం కప్పు బియ్యం తీసుకుని బాగా కడగండి. ఆ తర్వాత అందులో ఒకటి నుంచి రెండు కప్పుల నీటిని పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే బియ్యం నీటిని, బియ్యాన్ని వేరు చేయండి. వేరు చేసిన బియ్యం నీటిని ఐదు నిమిషాల పాటు వేడి చేయండి. ఇది కాస్త చిక్కబడ్డాక చల్లారనివ్వండి.
గోరువెచ్చని బియ్యం నీటిని తల కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి బాగా మర్థనా చేయండి. దీనిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత తల స్నానం చేయండి. వారానికి ఒకసారి దీనిని జుట్టుకు వాడితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)