EPAPER

Health Tips: మారుతున్న జీవన విధానం.. వ్యాధుల బారిన పడుతున్న జనం

Health Tips: మారుతున్న జీవన విధానం.. వ్యాధుల బారిన పడుతున్న జనం

Health Tips: మారుతున్న జీవనశైలి, అదుపుతప్పిన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నేడు బిజీ లైఫ్‌ కారణంగా శారీరక శ్రమ తగ్గుతోంది. వీటి వల్ల జనం జబ్బులను కోరి కొని తెచ్చుకుంటున్నారు. మారుతున్న జీవన శైలి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రజలు ఎలాంటి వ్యాధులకు గురవుతున్నారో.. వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒప్పుడు తెలుసుకుందాం.


డయాబెటిస్:
జీవన శైలిలో సమతుల్యత తప్పితే అనారోగ్యాల పాలవడం ఖాయం. ఉరుకుల, పరుగుల జీవితం కారణంగా ఎక్కువ మంది ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అనేక మందిని షుగర్ సమస్య ఇబ్బంది పెడుతోంది. దీని గురించి బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారమే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు బరువు నియంత్రణ కూడా చాలా అవసరం. ముఖ్యంగా శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

హైబీపీ:
రక్త పోటును సైలెంట్ కిల్లర్ గా చెబుతుంటారు. ఎందుకంటే రక్తపోటు పెరిగిపోతున్న చాలా కాలం పాటు లక్షణాలు మనం గుర్తించలేం. రక్తపోటు కారణంగా కొందరు ఆయాసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటివి వస్తూ ఉంటాయి. కానీ కొందరిలోఇలాంటివేవి కనిపించవు. అయినప్పటికీ కిడ్నీ జబ్బులు, పక్షవాతం వంటి వాటికి హై బీపీముఖ్య కారణంగా కనిపిస్తుంది. వీటితో పాటు రక్తపోటు ఎక్కువ అయితే మెదడు, కాళ్లు, గుండె, మూత్రపిండాల సమస్యలకు కూడా ఇది కారణం అవుతుంది. వీటిని నివారించడానికి రక్తపోటు తగ్గించుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా బీసీతో ఇబ్బందిపడేవారు పెయిన్ కిల్లర్స్ వంటివి వాడకుండా ఉండడం మంచిది.


Also Read: పెరుగేకదా అని తీసిపారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే మతిపోవాల్సిందే !

గుండె జబ్బులు:
ఒకప్పుడు గుండె జబ్బులు అంటే పెద్ద వయస్సు వారికి మాత్రమే వస్తాయని భావించేవారు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మనం తినే ఆహారం రోజువారి అలవాట్లు నిత్యం ఎదుర్కొనే సవాళ్లు, జీవన శైలి, ఒత్తిడి గుండెపై ప్రభావాన్ని చూపుతున్నాయి. గుండెజబ్బులు నివారణకు వ్యాయమం చాలా అవసరం. అంతే కాకుండా తినే ఆహారంలో ఎక్కువ పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూర లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఊబకాయం:
మనం తినే ఆహారానికి తగినంత శారీరక శ్రమ చేసినప్పుడు ఎలాంటి జబ్బులు రావు. కానీ ప్రస్తుతం మనం తినే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కార్మిక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుత కాలంలో వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడానికి సమయం కూడా లేకుండా పోతోంది. అంతే కాకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పని చేయల్సి వస్తోంది. ఫలితంగా పదిమందిలో ఆరుగురు స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీటి నుంచి బయట పడాలంటే ఎక్కువ ఫైబర్ తక్కువ కొవ్వులు ఉన్న ఆహారాలు తినాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

AI Doctor: నాలుక చూసి రోగం ఏంటో చెప్పేస్తుంది, డాక్టర్ కాదండోయ్ AI టెక్నాలజీ.. ఇదిగో ఇలా గుర్తిస్తుందట!

Homemade Cough Remedies: వీటితో ఇంట్లోనే.. క్షణాల్లో దగ్గు మాయం

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

Pumpkin Juice Benefits: గుమ్మడికాయ జ్యూస్‌తో ఈ సమస్యలన్నీ దూరం

Weight Loss Tips: బరువు తగ్గించే 5 మార్గాల గురించి మీకు తెలుసా ?

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌.. ఇలా అప్లై చేయండి?

Diabetes and Sleep: నిద్రపోయే ముందు అరగంట పాటు ఈ పని చేయడం వల్ల డయాబెటిస్ తగ్గే అవకాశం ఎక్కువ

Big Stories

×