Rose Petals Face Pack: ప్రతి ఒక్కరూ తమ చర్మం గులాబీలా ప్రకాశవంతంగా, మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. అందమైన , ఆరోగ్యకరమైన చర్మం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌కు బదులుగా మీరు కొన్ని సులభమైన హోం రెమెడీస్ కూడా వాడవచ్చు. వీటి ద్వారా సహజమైన మెరుపును పొందవచ్చు. గులాబీ పూలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. గులాబీ పూలతో తయారు చేసిన హోం రెమెడీస్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంతో పాటు మృదువుగా , తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని అందంగా మార్చగల గులాబీలతో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజ్ వాటర్:
గ్లోయింగ్ స్కిన్ కోసం రోజ్ వాటర్:
రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, సహజంగా తాజాగా కనిపించేలా చేయడానికి సులభమైన అత్యంత ప్రభావవంతమైన మార్గం. చర్మాన్ని టోన్ చేయడంతో పాటు డ్రై స్కిన్ ను కూడా రోజ్ వాటర్ దూరం చేస్తుంది.మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించాలని మీరు కోరుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో రోజ్ వాటర్‌ను వాడటం మంచిది.
ఎలా ఉపయోగించాలి ?
కాటన్పై రోజ్ వాటర్ తీసుకుని, దానిని ముఖమంతా అప్లై చేయండి. రోజ్ వాటర్ చర్మాన్ని శోషించనివ్వండి. తర్వాత కడగకుండా కొద్దిసేపు అలాగే ఉంచండి.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది.
2. పెరుగు, గులాబీ రేకుల ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కొన్ని గులాబీ ఆకులను గ్రైండ్ చేసి, అందులో ఒక చెంచా పెరుగు కలపండి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. వారానికి రెండుసార్లు దీన్ని ఉపయోగించడం వల్ల మీ చర్మం కోల్పోయిన రంగును తిరిగి పొందవచ్చు.
పెరుగు ఆరోగ్యానికే కాదు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది. గులాబీ రేకుల్లో ఉండే సహజ నూనె చర్మాన్ని మృదువుగా, తాజాగా చేస్తుంది.
3. తేనె, రోజ్ ఫేస్ మాస్క్:
తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. గులాబీ రేకుల పేస్ట్‌తో కలిపి తేనెను అప్లై చేయడం వల్ల చర్మానికి రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ శీతాకాలంలో మీ చర్మం నిర్జీవంగా మారినట్లయితే, మీరు తేనె, గులాబీ ఫేస్ మాస్క్‌ను ఉపయోగించవచ్చు.
ఎలా ఉపయోగించాలి ?
ముందుగా గులాబీ ఆకులను పేస్టులా చేసి అందులో ఒక చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
మీ చర్మం పొడిగా ఉంటే, మీరు వారానికి 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు.
Also Read: మైగ్రేన్‌కు శాశ్వాత పరిష్కారం ఉందా ?
4. రోజ్, అలోవెరా:
అలోవెరా చర్మాన్ని రిపేర్ చేయడంలో , లోతుగా హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్‌లో అలోవెరా మిక్స్ చేసి ముఖానికి వాడటం వల్ల చర్మం తాజాగా మారతుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఇందుకోసం ముందుగా రోజ్ వాటర్‌లో ఒక చెంచా అలోవెరా జెల్‌ను కలిపి ముఖానికి రాసుకోవాలి.
ఆ తర్వాత చేతులతో మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మీ చర్మం మృదువుగా,మెరుస్తూ, తాజాగా కనిపించేలా చేస్తుంది.