BigTV English

Trump Canada Tariffs : దెబ్బకు దెబ్బ.. కెనెడాపై సుంకాలు విధించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన ట్రూడో

Trump Canada Tariffs : దెబ్బకు దెబ్బ.. కెనెడాపై సుంకాలు విధించిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన ట్రూడో

Trump Canada Tariffs | రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్, తన పాలనలో దూకుడు విధానాన్ని మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా, సుంకాల విషయంలో తగ్గే అవకాశం లేదన్నట్లుగా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా.. కెనెడా, మెక్సికో దిగుమతులతో పాటు చైనాపై కూడా సుంకాలు విధిస్తానని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఆ హెచ్చరికలను నిజం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా దేశాలపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.


“ఈ రోజు మెక్సికో, కెనెడా దిగుమతులపై 25 శాతం, చైనా దిగుమతి వస్తువులపై 10 శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశాను. ఫెంటనిల్ తో సహా అమెరికా పౌరులను చంపే ప్రాణాంతకమైన, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమెరికన్లను రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. అందరికీ భద్రత కల్పించడం దేశ అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులు, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి పనిచేస్తున్నాను.” అని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో ఓ పోస్టులో పేర్కొన్నారు.

కెనెడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధించే ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేసినట్లు ప్రకటించాగానే కెనెడా, మెక్సికో దేశాలు అదే విధంగా స్పందించాయి. ట్రంప్ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనెడా, మెక్సికో దేశాల నాయకులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ట్రంప్‌నకు వేగంగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగానే తాము కూడా ప్రతిచర్యగా అమెరికా నుంచి కెనెడా వచ్చే దిగుమతులపై తాము సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది.


Also Read: వెనిజులా క్రిమినల్స్‌ను వెనక్కు పంపుతున్నాం.. అక్రమవలసదారులపై ట్రంప్ పరుష వ్యాఖ్యలు

“155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం. వాషింగ్టన్ చర్యలకు ఇది కెనెడా ప్రతిస్పందన. ఈ మొత్తంలో 30 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతి వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే.. మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికి మంచిది,” అని ట్రూడో పేర్కొన్నారు.

మరోవైపు, మెక్సికో కూడా కెనెడా బాటలోనే నడిచింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ పేర్కొన్నారు. “డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాను. మా ప్రభుత్వం నాలుగు నెలల్లో 20 మిలియన్ డోస్ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. పదివేల మందిని అరెస్టు చేశాం. మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది తప్ప.. ఘర్షణ కాదు. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే.. అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. టారిఫ్‌లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. ఆర్థిక కార్యదర్శిని ప్లాన్ బీ అమలు చేయాలని ఆదేశించాను,” అని షేన్‌బామ్ ఎక్స్‌లో రాసుకున్నారు.

ఇక చైనా మాత్రం సమయం చూసి సమాధానం చెబుతామని, ప్రపంచ వాణిజ్య సంస్థ (World Trade organisation)లో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని తెలిపింది. వాణిజ్య పరంగా యుద్ధం చేస్తే.. ఎవరికీ విజయం దక్కదని.. సుంకాలు విధిస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయిన చైనా విదేశాంగ మంత్రి చెప్పారు. ఏదైనా సమస్యలుంటే దీనిపై చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×