Skin Care Routine: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ ఒక్కటి వాడితే మాత్రం సరిపోదు. చర్మ తత్వాన్ని బట్టి గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ తప్పకుండా పాటించాలి. అంతే కాకుండా స్కిన్ కేర్ రొటీన్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
మీరు గంటల తరబడి పార్లర్ లో గడపాల్సిన అవసరం లేదు. స్కిన్ కేర్ రొటీన్ పాటించడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం కోసం ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ క్లీనింగ్:
గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు మందుగా చేయాల్సింది మీ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడమే. దీని కోసం మీరు క్లెన్లర్ ఉపయోగించండి. మురికి , జిడ్డు తొలగించడానికి క్లెన్సర్ తో మీ ముఖాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేయండి. మీకు సహజమైన పద్దతి కావాలంటే పచ్చిపాలలో దూదిని నానబెట్టి ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ ముఖాన్ని మాయిశ్ఛరైజ్ చేయడంతో పాటు లోతుగా శుభ్రపరుస్తుంది.
స్క్రబ్బింగ్:
మృతకణాలను తొలగించడంలో స్క్రబ్బింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వారానికి రెండు సార్లు స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. ఇందుకోసం కాస్త తేనెను తీసుకుని అందులో చక్కెర కలిపి ముఖానికి స్క్రబ్ చేయండి. దీనిని 15 నిమిషాల పాటు ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆపై గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. ఇలా ఇంట్లోనే సహజమైన స్క్రబ్ తయారు చేసుకుని వాడవచ్చు.
ఫేస్ ప్యాక్:
ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని లోపల నుండి పోషణను అందిస్తుంది. అందుకే ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడం కోసం పెరుగులో పసుపు కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15- 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా మృదువుగా మారుస్తుంది.
టోనింగ్ :
గ్లోయింగ్ స్కిన్ కోసం చర్మానికి తేమను అందించడం చాలా ముఖ్యం. దీని కోసం, మీ చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్ ఎంచుకోండి. అంతే కాకుండా మీది జిడ్డు చర్మం అయితే జెల్ లాంటి మాయిశ్చరైజర్ వాడండి. మీది డ్రై స్కిన్ అయితే క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ఎంచుకోండి. కావాలంటే ఇందుకు మీరు కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు.
సన్ స్క్రీన్:
మీరు పగటి పూట బయటకు వెళ్లే మాత్రం తప్పకుండా సన్ స్కిన్ వాడండి. ఇది మీ చర్మాన్ని హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది. బయటకు వెళ్లే ముందుకు 15- 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ వాడండి.
Also Read: టమాటాతో ఫేస్ ప్యాక్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం
తేమ:
చర్మాన్ని తేమగా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి. ఇది మీ శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నీరు, పండ్ల రసం, గ్రీన్ టీ చర్మానికి మేలు చేస్తాయి.