BigTV English

Sunscreen Effect on Skin: సన్‌స్క్రీన్ చర్మానికి మంచిదేనా..? లేదా హానికరమా..?

Sunscreen Effect on Skin: సన్‌స్క్రీన్ చర్మానికి మంచిదేనా..? లేదా హానికరమా..?

Sunscreen Effect on Skin: సీజన్‌ను బట్టి చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో సూర్యరశ్మి నేరుగా చర్మాన్ని నేరుగా తాకడం వల్ల పాడవుతుంది. కాబట్టి సమ్మర్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వయస్సు ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. చర్మ క్యాన్సర్ కూడా రావచ్చు. అందువల్ల సూర్యుని హానికరమైన కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలు సన్‌స్క్రీన్ క్రీమ్‌ను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో సన్‌స్క్రీన్‌ను చర్మానికి అప్లై చేస్తారు. అయితే సన్‌స్క్రీన్ అనేది నిజంగా సూర్యకాంతి నుంచి కాపాడుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


సన్‌స్క్రీన్ ఎందుకు అవసరం?
వాస్తవానికి సన్‌స్క్రీన్ చర్మంపై రాయడం వల్ల అది పొరలా ఏర్పడుతుంది. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ వంటి ముఖ్యమైన సన్‌స్క్రీన్‌లో బలమైన సూర్యకాంతి వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోంటాయి. ఇది చర్మాన్ని వృద్ధాప్య ప్రభావాల నుంచి వడదెబ్బ నుండి రక్షిస్తుంది.

సన్‌స్క్రీన్ ప్రభావవంతంగా ఉందా?
సన్‌స్క్రీన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేది అందులో ఉండే సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ (SPS)పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. సన్‌స్క్రీన్ అంత ప్రభావవంతంగా ఉంటుంది. సన్‌స్క్రీన్‌లో SPS 15 ఉంటే 15 రెట్లు ఎక్కువ సూర్యరశ్మిన ఉందని అర్థం. అటువంటి పరిస్థితిలో మీరు సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళితే సన్‌బర్న్ అయ్యే ప్రమాదం 15 రెట్లు పెరుగుతుంది. సూర్యరశ్మిని నివారించడానికి ఎల్లప్పుడూ 30-50 SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.


Also Read: ఎవరైనా మీ చెవుల్లో ఈలలు వేస్తున్నట్లు అనిపిస్తుందా..?

సన్‌స్క్రీన్‌ను ఎలా అప్లై చేయాలి
మీరు సన్‌స్క్రీన్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు చర్మంపై అప్లై చేయండి. అలానే ప్రతి రెండు గంటల వ్యవధిలో దీన్ని అప్లై చేయండి. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాతే మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ వేసుకునే అమ్మాయిలు కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. కళ్ల కింద సన్‌స్క్రీన్ అప్లై చేయండి. బయటకు వెళ్లడం వల్ల ఐ బ్యాగులు రాకుండా ఉంటాయి.

సన్‌స్క్రీన్ వల్ల కలిగే ప్రయోజనాలు

  •  సన్ బర్న్ మరియు టానింగ్‌ను నివారిస్తుంది.
  •  చర్మం ఆరోగ్యంగా మారుతుంది మరియు హైపర్పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం పొందుతుంది.
  •  చర్మ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
  • మొటిమల గుర్తులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • అకాల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.

సన్‌స్క్రీన్ వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

  •  సన్‌స్క్రీన్‌ను తయారు చేయడంలో అనేక రకాల కెమికల్స్ ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని చర్మం లోపల కణజాలానికి చేరడం ద్వారా హాని చేస్తాయి. వీటిలో టెట్రాసైక్లిన్, సల్ఫా ఫినోథియాజైన్ వంటివి ఉన్నాయి.

Also Read: బరువు తగ్గాలంటే ఈ 5 రకాల పప్పులు తింటే చాలు!

  • సన్‌స్క్రీన్ తయారీలో ఉపయోగించే కెమికల్స్ వల్ల చర్మంపై దురద, ఎర్రగా దద్దుర్లు, వాపు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీకు అలెర్జీగా అనిపిస్తే దానిని ఉపయోగించవద్దు.
  • సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కంటికి తాకవచ్చు. ఇది చికాకు కలిగిస్తుంది.
  •  చర్మం సెన్సిటివ్ అయితే సన్‌స్క్రీన్ అప్లై చేయడం హానికరం. ఎందుకంటే అందులో ఉండే రసాయనాలు మొటిమలను పెంచుతాయి.

Disclaimer: ఈ కథనాన్ని ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా రూపొందిందాం. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదించండి.

Tags

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×