BigTV English

Anga Tribe: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

Anga Tribe: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

Anga Tribe: ఈజిప్టు మమ్మీలకు ప్రసిద్ధి. ఈజిప్ట్ పిరమిడ్లలో వందల కొద్ది మమ్మీలు బయటపడుతున్నాయి. అప్పట్లో ఈజిప్టు ప్రజలు మరణించిన తమ రాజులు, రాణులను మమ్మీల రూపంలో భద్రపరిచేవారు. అప్పట్లో ఆ రాజులు, రాణులు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారని నమ్మేవారు. ఇప్పటికీ మరణించిన వారిని మమ్మీలుగా మారుస్తున్న ప్రజలు ఇంకా ఉన్నారు.


ఏ తెగ వారు?
పపువా న్యూ గినియా దీవిలో అసేకి అనే జిల్లాలో అంగా అని పిలిచే తెగవారు జీవిస్తున్నారు. దాదాపు 45 వేలమంది వీరి జనాభా ఉంది. వీరు అరణ్యం పై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇప్పటికీ గాలి, పొగ మంచు, సూర్యుడు కదలికలను బట్టి శకునాలను అంచనా వేస్తారు. ఆధునిక ప్రపంచానికి ఎంతో దూరంగా జీవిస్తున్న అంగా ప్రజలు చనిపోయిన వారిని ఇప్పటికీ మమ్మీలుగా మారుస్తారు.

ఎలా మమ్మీలుగా మారుస్తారు?
అంగా ప్రజలు అనుసరించే మమ్మీ ఫికేషన్ ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. పురాతన ఈజిప్టులో చేసిన మమ్మీల్లాగా ఉండదు. వీరు శరీరంలోని అవయవాలను తొలగించి ఆపై ఆ ఎముకల గూడును మాత్రమే ఉంచుతారు. ఆ ఎముకల గూడుకు వస్త్రాలను చుడతారు. ఇలా చేసిన మమ్మీలు వందల కాలం పాటు చెక్కుచెదరకుండా అలాగే ఉంటాయి. అయితే వీరు చేసే మమ్మీఫికేషన్  ప్రక్రియ మూడు నెలల పాటు కొనసాగుతుంది.


అంగా తెగలు ఎవరైనా మరణిస్తే వారి శరీరాన్ని నిప్పులపై కాల్చరు. కింద మంట పెట్టి, మంటకి కొంత ఎత్తులో మరణించిన వారి శరీరాన్ని వేలాడదీస్తారు. ఆ చిన్న వేడి శరీరానికి తగిలి ఉబ్బినట్టు అవుతుంది. అలాంటి సమయంలో కర్రలతో శరీరాన్ని పొడిచి అందులోని ద్రవాలను తీసేస్తారు. ఆ తరువాత మలద్వారాన్ని వెడల్పుగా చేసి లోపల నుంచి అవయవాలను తొలగిస్తారు. కానీ శరీరంలోని ఏ భాగాన్ని భూమిని తాకనివ్వరు. ఆ తర్వాత మిగిలిన ఆ శరీరానికి ఎర్ర మట్టిని పూస్తారు. అడవిలో ఉన్న తమ పుణ్యక్షేత్రంలోనే ఈ పనిని చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతుంది.

Also Read: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

అంగా తెగవారు మమ్మిఫికేషన్ చేయడానికి కొంతమందిని నియమించుకుంటారు. వారే గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా మమ్మి ఫికేషన్ చేస్తారు. వారు అడవిలోని తమ పుణ్యక్షేత్రంలోనే ఈ పని చేపడతారు. మూడు నెలల పాటు వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టరు. స్నానం చేయరు .అక్కడే ఉండి ఆ పని పూర్తయ్యాకే తమ ఇళ్లకు వస్తారు.

మమ్మీ ఫికేషన్ ప్రక్రియలో చనిపోయిన వారి ముఖం చెక్కుచెదరకుండా చూసుకుంటారు. వారు తమ పూర్వీకుల ఆత్మలు పగటిపూట తిరుగుతాయని, రాత్రికి తిరిగి వారి శరీరాలకు చేరుకుంటాయని అంగా తెగ ప్రజలు నమ్ముతారు. ముఖాలు లేకపోతే వారిని గుర్తుపట్టడం కష్టం కాబట్టి ముఖాలు చెక్కుచెదరకుండా కాపాడుకుంటారు. మరణించిన పూర్వీకులు శాశ్వతంగా భూమిపై తిరుగుతూ ఉండాలని అంగా తెగవారి కోరిక.

మమ్మిఫికేషన్ పూర్తయ్యాక ఒక కుర్చీలో ఆ శరీరాన్ని కూర్చోబెట్టి గ్రామంలో ఒక చివర ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడే మమ్మిఫికేషన్ చేసిన మమ్మీలు ఒకదాని పక్కన ఒకటి కూర్చుని ఉంటాయి. అక్కడ ఎన్నో మమ్మీలు కుర్చీలో కూర్చుని కనిపిస్తూ ఉంటాయి. అంగా తెగవారి ఈ ప్రక్రియ ఆధునిక ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×