BigTV English
Advertisement

Relationships: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

Relationships: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

Relationships: వైవాహిక అనుబంధం చక్కగా సాగాలంటే భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. వీరి బంధం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సున్నితమైన బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరికీ ఉంది. వారిద్దరూ హానికరమైన పదబంధాలను, మాటలను వాడకుండా నిర్మాణాత్మక విమర్శలతోనే జీవితాన్ని ముందుకు సాగేలా చూసుకోవాలి. అప్పుడే వారి బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. అయితే మీరు ఎంతగా మీ జీవిత భాగస్వామిని ప్రేమించినా, నిజాయితీగా ఉందామనుకున్నా కూడా… వారితో కొన్ని మాటలు మాట్లాడడం వల్ల మీ మధ్య దూరం పెరిగిపోతుంది.


ఐ డోంట్ కేర్
మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలు అయినప్పుడు కొన్ని రకాల పదాలను వాడకూడదు. అందులో ముఖ్యమైనది ‘ఐ డోంట్ కేర్’. ఇది చెప్పడం వల్ల ఎదుటివారి మనసు విరిగిపోయే అవకాశం ఉంది. వారిని అగౌరవపరిచినట్లుగా అనిపించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి భావాలతో విభేదించినప్పటికీ పరుషమైన పదాలను వాడకూడదు.

అంతా నీ తప్పే
ప్రతి వ్యక్తి తప్పులు చేస్తారు. మీ జీవిత భాగస్వామి తప్పు చేసినప్పుడు పదే పదే  ఆమెను లేదా అతడిని నిందించడం, అంతా నీదే తప్పు అంటూ తిట్టడం వంటివి వారిలో మీపై విరక్తిని పెంచుతుంది. ఆరోగ్యమైన సంబంధాన్ని చెడగొడుతుంది.


ఇంట్లో జీవిత భాగస్వామితో గొడవ అయినప్పుడు తిట్టే వారి సంఖ్య ఎక్కువే. కొన్ని రకాల తిట్లు మీ మధ్య అనుబంధాన్ని, ప్రేమను తగ్గిస్తాయి. మీరు వాడే కఠినమైన మాటలు మీపై ద్వేషాన్ని పెంచవచ్చు. కాబట్టి స్వరాన్ని పెంచకుండా మృదువైన పదజాలంతోనే ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పాలి.

Also Read: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

డివోర్స్ అనొద్దు
కొంతమంది భార్యాభర్తలు కోపం వస్తే చాలు విడాకులు ఇస్తానంటూ బెదిరిస్తారు. ఇలా పదే పదే డివోర్స్ అనే పదాన్ని వాడడం మీ అనుబంధాన్ని విచ్చిన్నం చేస్తుంది. విడాకులు అనే పదాన్ని మీరు మర్చిపోండి. ఇది మీ జీవిత భాగస్వామిలో అభద్రతాభావాన్ని పెంచుతుంది.

మాజీ ప్రేమికులతో పోల్చడం
మీ జీవిత భాగస్వామి మీద కోపం వచ్చినప్పుడు ప్రతిసారీ మీ మాజీ ప్రేమికురాలతో పోల్చడం అనేది ఎదుటివారిని ఎంతో కష్టపెడుతుంది. శరీరంపై పడిన దెబ్బ కన్నా మాజీ ప్రేమికులతో పోల్చడమే వారి మనసుకు తీవ్రమైన గాయాన్ని చేస్తుంది. అలాంటి పని మీరు చేస్తే వెంటనే మానేయండి.

ప్రేమించలేదని చెప్పవద్దు
భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు కొంతమంది జీవిత భాగస్వామితో తనను ఎప్పుడూ ప్రేమించలేదని, తప్పక పెళ్లి చేసుకున్నానని కామెంట్లు చేస్తారు.  కోపంలో ఈ మాటలు అన్నా ఎదుటి వారికి మాత్రం ఎంతో బాధను మిగులుస్తాయి. అది మీ దీర్ఘకాల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి అలాంటి పదబంధాలు వాడడం వెంటనే మానేయండి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×