BigTV English

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Home Remedies For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా రకాల ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ మార్కెట్లో సులువుగా లభిస్తున్నాయి. కానీ మీకు కావాలంటే, మీరు ఇంట్లోనే హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడవచ్చు. వీటితో మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కలోంజి విత్తనాలు జుట్టును ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కలోంజి గింజల నీరు జుట్టుకు మూలాల నుంచి పోషణను అందించడమే కాకుండా జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తుంది.


కలోంజి అనేది యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కలోంజిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.ఇవి జుట్టుకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. కలోంజి జుట్టు యొక్క ప్రోటీన్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.

కలోంజి విత్తనాలతో హోం రెమెడీస్:


1. కలోంజి నీరు:

కావలసినవి:
కలోంజి గింజలు: 4-5 టీ స్పూన్లు
నీరు- కప్పు
తయారీ విధానం: కలోంజి నీటిని సిద్ధం చేయడానికి ముందుగా ఒక పాత్రలో నీరు పోసి అందులో కలోంజి విత్తనాలను వేయండి. ఇప్పుడు ఈ నీటిని 20 నిమిషాలు మరిగించాలి. దీని తరువాత గ్యాస్ ఆఫ్ చేయండి. అనంతరం నీటిని చల్లబరచండి.

ప్రయోజనాలు: జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కలోంజి నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.ఈ నీటిని తరుచుగా తలకు అప్లై చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. దీని ఫలితం మీకు కొన్ని రోజుల్లోనే కనిపిస్తుంది.

2. కలోంజి, కొబ్బరి నూనె :
కావలసినవి:
కలోంజి గింజలు- 4-5 టీ స్పూన్లు
కొబ్బరి నూనె- చిన్న కప్పు

తయారీ విధానం: కలోంజి గింజలను ముందుగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్‌ను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు రాయండి. మీకు కావాలంటే.. కొబ్బరి నూనె, కలోంజి విత్తనాలను వేడి చేసి ఆ నూనెను కూడా మిక్స్ చేసి జుట్టు యొక్క మూలాలకు అప్లై చేయవచ్చు.ఈ నూనె రాసుకున్న 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరగడం మొదలవుతుంది.

3. కలోంజి, మెంతి గింజలు:
కావలసినవి:
కలోంజి గింజలు-3 టేబుల్ స్పూన్లు
మెంతి గింజలు- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- 100 గ్రాములు

Also Read: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన మెతాదులో కొబ్బరి నూనెను తీసుకొని ఒక పాత్రలో వేసి వేడి చేయండి. ఈ నూనెలో కలోంజి గింజలు, మెంతి గింజలను కలపండి. దీనిని 15 నిమిషాల పాటు వేడి చేసి ఆతర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ నూనెను వడబోసి ఒక సీసాలో నింపి మీ జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేయండి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×