E-Paper
Advertisement

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి
Advertisement

Memory Increase: వయస్సు పెరిగే కొద్దీ మరచిపోయే అలవాటు సర్వసాధారణం. కానీ కొందరు చిన్న వయస్సులోనే మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కొంత వరకు మతి మరుపు ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ రోజురోజుకు మతిమరుపు సమస్య పెరుగుతున్నట్లయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇలాంటి సమయంలో మందులకు బదులుగా, కొన్ని సహజ పద్ధతులు కూడా మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా సరైన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చురుకుగా ఉండేలా చేస్తాయి.

Advertisement

తరచుగా మరచిపోయే అలవాటు అనేక కారణాల వల్ల వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బటయ పడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తిని పెంచే మార్గాలు:

Advertisement

జీవనశైలిలో తప్పకుండా చేయాల్సిన మార్పులు..

తగినంత నిద్ర పొందండి:
నిద్రలేమి జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అందుకే రోజు 7-8 గంటల నిద్ర పోవడం అలవాటు చేసుకోండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:
గింజలు, పండ్లు, కూరగాయలతో పాటు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.విటమిన్లు ఉండే ఆహార పదార్ధాలను ఎక్కువగా తినండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

వ్యాయామం మెదడులో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

ఒత్తిడిని తగ్గించుకోండి:

ఒత్తిడి జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే పనులను ప్రాక్టీస్ చేయండి.

తగినంత నీరు త్రాగండి:

శరీరంలో నీరు లేకపోవడం జ్ఞాపకశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి రోజు 8- 10 గ్లాసుల నీరు త్రాగండి.

జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మార్గాలు..
కొత్త విషయాలను నేర్చుకోండి: కొత్త భాషను నేర్చుకోండి. కొత్త సంగీత వాయిద్యాన్ని ప్లే చేయండి .లేదా కొత్త కళను నేర్చుకోండి. ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది.

Also Read: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

చదవండి: పుస్తకాలు చదవడం వల్ల మెదడుకు పదును పెట్టి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆటలు ఆడండి: చెస్, సుడోకు లేదా ఇతర మెదడును ఉత్తేజపరిచే ఆటలు ఆడండి.

వ్రాయండి: మీ ఆలోచనలు, అనుభవాలను వ్రాయండి. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది.

సహాయానికి తగిన సాధనాలను ఉపయోగించండి: క్యాలెండర్‌లు, రిమైండర్ యాప్‌లు లేదా గమనికలను ఉపయోగించండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×