BigTV English

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు చాలా అవసరం. శరీరంలో నీరు సరిగ్గా లేకపోవడం వల్ల తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యాధుల్లో కిడ్నీ స్టోన్ కూడా ఒకటి. శరీరానికి తగినంత నీరు అందనప్పుడు, కిడ్నీలో ఉండే మినరల్స్ తో పాటు ఇతర మూలకాలు పేరుకుపోతాయి. ఇది రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.


తగినంత నీరు త్రాగాలి:

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ప్రతి రోజు తగినంత నీరు త్రాగాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. కానీ చలికాలం వచ్చిందంటే దాహం వేయక పోవడంతో నీరు తక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే చలికాలంలో కూడా మన శరీరానికి ఎప్పటిలాగానే నీరు తగినంత అవసరం అవుతుంది.


వివిధ రకాల డ్రింక్స్ త్రాగండి:

నీళ్లే కాదు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలు కూడా నీటి కొరతను తీర్చడంలో సహాయపడతాయి. ఈ ద్రవాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, శరీరంలోని విటమిన్లు, మినరల్స్ లోపాన్ని కూడా తగ్గిస్తాయి.

లెమన్ వాటర్ త్రాగండి:

రోజు తాజా నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగడం వల్ల రాళ్లను నివారించవచ్చు. ఇది సహజ మార్గం. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న రాళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది.

కెఫిన్ పానీయాలను నివారించండి:

టీ, కాఫీ, శీతల పానీయాలు వంటి కెఫిన్‌తో కూడిన పానీయాలు శరీరం నుండి నీరు ఎక్కువగా బయటకు పంపిస్తాయి. అందుకే ఈ పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేయగలుగుతాయి. ఇది మూత్రపిండాలకు హానికరం. ఇందువల్ల వీటిని తక్కువ పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×