EPAPER

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Homemade Face Mask: ముఖం అందంగా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం అవసరం. ప్రతి ఒక్కరు చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. కొం మంది స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తూ ఉంటారు. మరి కొంత మంది హోం రెమెడీస్ ట్రై చేస్తారు. ముఖానికి కొన్ని రకాల ఫేస్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల తాత్కాలికంగా ముఖం మెరిసిపోయినప్పటికీ ఆ తర్వాత మాములై పోతుంది. అలా కాకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల ముఖం ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది.


గ్లోయింగ్ స్కిన్ కోసం క్రీమ్..

క్రీమ్ తో తయారు చేసిన ఫేస్ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఫేస్‌కు క్రీమ్ ఫేస్ మాస్క్ ఉపయోగిస్తే.. తక్కువ సమయంలోనే తేడా కనిపిస్తుంది. ముఖానికి క్రీమ్ ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా అప్లై చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖంపై క్రీమ్ ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేయాలి ?

క్రీమ్ ఫేస్ మాస్క్:
కావలసినవి:
ఫ్రెష్ క్రీమ్ -2 టీస్పూన్లు
తేనె- 1/4 టీస్పూన్

తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 టీస్పూన్ తేనె, 1/4 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

క్రీమ్ క్లెన్సర్:

ఒక బౌల్ తీసుకుని దానిలో 1 టీస్పూన్ క్రీమ్, కాస్త రోజ్ వాటర్ లేదా టీ ట్రీ ఆయిల్ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం , మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఉంచి తడి గుడ్డతో మెల్లగా తుడవండి. ఇది ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది.

మాయిశ్చరైజర్:

నిద్రపోయే ముందు మీ ముఖం, మెడపై కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయండి. కొన్ని రోజుల పాటు ఇలా చేయడం వల్ల మీ ముఖం అందంగా మారుతుంది. ముఖ చర్మంలో తేడా కనిపిస్తుంది. అందుకే రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ వాడటాన్ని అలవాటు చేసుకోండి.

చర్మంపై క్రీమ్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: క్రీమ్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది. పొడి చర్మానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

Also Read: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: క్రీమ్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

మొటిమలతో పోరాడుతుంది: క్రీమ్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.

ముడతలను తగ్గిస్తుంది: క్రీమ్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Vultures: రాబందులు చనిపోతే.. మనిషి పరిస్థితి అంతే!

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Big Stories

×