BigTV English
Advertisement

Aloo Halwa: ఓసారి ఆలూ హల్వా చేసి చూడండి, రెసిపీ అదిరిపోతుంది.. ప్రసాదంగా కూడా వాడొచ్చు

Aloo Halwa: ఓసారి ఆలూ హల్వా చేసి చూడండి, రెసిపీ అదిరిపోతుంది.. ప్రసాదంగా కూడా వాడొచ్చు
ఇంట్లో ఏదైనా తినాలనిపించినప్పుడు, అతిధులు వచ్చినప్పుడు, దేవుళ్ళకి ప్రసాదంగా ఎక్కువగా తీపి పదార్థాలను వండుతూ ఉంటారు. ముఖ్యంగా హల్వాలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ. ఇంట్లో క్యారెట్ హల్వా, బాదం హల్వా, పాయసం వంటివే కాదు బంగాళదుంపలతో ఆలూ హల్వా కూడా చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిజర్ట్ లో బెల్లం వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. కేవలం 20 నిమిషాల్లో ఈ హల్వా రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.


ఆలూ హల్వాకు కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – రెండు
నెయ్యి – ఒక స్పూన్
పాలు – పావు కప్పు
బెల్లం తురుము – నాలుగు స్పూన్లు
కిస్ మిస్‌లు – గుప్పెడు
జీడిపప్పు – గుప్పెడు
యాలకుల పొడి – చిటికెడు
బాదం – గుప్పెడు

ఆలూ హల్వా రెసిపీ
1. బంగాళదుంపలను ఉడకపెట్టి పైన తొక్కను తీయాలి.
2. ఆ బంగాళదుంపని ఒక గిన్నెలో వేసి చేత్తోనే మెత్తగా మెదపాలి.

3.  ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
4. ఆ నెయ్యి వేడెక్కాక బంగాళదుంపల పేస్టు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
5. ఆ తర్వాత బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి.
6. పంచదార కరిగి బంగాళాదుంప మిశ్రమంలో కలిసిపోతుంది.
7. అది దగ్గరగా అయ్యాక పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. పాలు కూడా ఇంకి దగ్గరగా అవుతున్నప్పుడు యాలకుల పొడిని చల్లుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి.
9. అంతే టేస్టీ బంగాళదుంప హల్వా రెడీ అయినట్టే. దీన్ని గోరువెచ్చగా తింటే రుచి అదిరిపోతుంది.
10. బంగాళదుంపల్ని ఉడకబెట్టి చేశాం కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే.


బంగాళదుంపలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది ఆలూతో చేసిన ఆహారాన్ని తినడానికి భయపడతారు. బంగాళదుంపలను బాగా ఉడకబెట్టడం వల్ల అందులో ఉండే పిండి పదార్థం 50 శాతానికి పడిపోతుంది. అలా ఉడకబెట్టిన బంగాళదుంపలతో చేసిన స్వీట్ ను తినవచ్చు. ఇక్కడ మనము బెల్లాన్ని ఉపయోగిస్తే మంచిది. ఎక్కువ మంది పంచదారను వినియోగిస్తారు. బెల్లాన్ని ఉపయోగించడం వల్ల అందులో ఉండే ఇనుము కూడా శరీరంలో చేరుతుంది. ఒకసారి ఈ బంగాళదుంప హల్వాను ప్రయత్నించి చూడండి. మీకు ఎంతో నచ్చడం ఖాయం.

బంగాళదుంపల్లో  పిండి పదార్థం అధికంగా ఉన్నప్పటికీ ఉడకబెట్టిన బంగాళదుంప ఆహారాలను అప్పుడప్పుడు తినడం చాలా అవసరం. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు సాధారణ బంగాళాదుంపలను తినకూడదు. బాగా ఉడికించాకే తినాలి. అది కూడా వారానికి ఒక్కసారి మాత్రమే అంతకుమించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది. బరువు పెరగాలనుకునే వారు తరచూ బంగాళదుంపను ఆహారంలో భాగం చేసుకోండి.

దీనిలో ఉండే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బరువును త్వరగా పెంచుతాయి. అదే  సన్నబడాలనుకునేవారు బంగాళదుంపలను తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపల్లో ఉండే పోషక లక్షణాలు కీళ్ల నొప్పులను, ఇన్ఫెక్షన్లను అరికడతాయి. కాలిన గాయాలకు ఉడకబెట్టిన బంగాళాదుంపను లేదా పచ్చి బంగాళదుంప రసాన్ని పెట్టడం వల్ల త్వరగా తగ్గుతాయి. పుండ్లు వచ్చినా కూడా పచ్చి బంగాళదుంపరం మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పుండ్లపై అప్లై చేయండి. ఇది త్వరగా పుండు మానేలా చేస్తుంది.

బంగాళదుంపలను కొన్ని రకాల మనుషులు తినకూడదు. ముఖ్యంగా మధుమేహంతో ఉన్నవారు, అధిక బరువుతో ఉన్నవారు బంగాళదుంపలను తింటే మరింతగా సమస్య పెరిగిపోతుంది. కాబట్టి బంగాళదుంపలతో వండిన ఆహారాలు తినేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. రాత్రిపూట బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని మానేయడమే మంచిది. ఒకవేళ ఆటూ రెసిపీలు తినాల్సి వస్తే మధ్యాహ్న భోజనంలోనే తినండి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×