Turmeric: పసుపు అనేది ప్రతి భారతీయ వంటగదిలో తప్పకుండా ఉంటుంది. పసుపును వాడటం వల్ల ఆహారం యొక్క రంగు పెరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా పసుపు చాలా ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే పసుపు పాలు తాగడం కూడా మంచిదని చెబుతుంటారు. పసుపును చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. చాలా వరకు అమ్మమ్మల కాలం నుంచి పసుపును చర్మానికి ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం.
పెళ్లిళ్ల సమయంలో కూడా వధువు చర్మ సౌందర్యం కోసం పసుపును కూడా ఉపయోగిస్తారు. పసుపు ముఖానికి అనేక ప్రయోజనాలను అందించినట్లే.. నష్టాలను కూడా కలిగిస్తుంది. పసుపును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మచ్చలను తొలగిస్తుంది:
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మచ్చలను తేలికగా తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.
పసుపు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది:
చర్మాన్ని మెరిసేలా చేయడంలో పసుపు చాలా బాగా పని చేస్తుంది. దీని రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీరు దీన్ని పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. తద్వారా చర్మం మెరుస్తూ ఉంటుంది.
మొటిమలను తొలగిస్తుంది:
పసుపును ముఖంపై సరిగ్గా ఉపయోగిస్తే, ముఖంపై మొటిమలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా ముడతలు , వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. తరుచుగా పసునును వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. పసుపులో కొన్ని రకాల పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి వేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఫలితంగా ముఖం మెరిసిపోతుంది.
ముఖాన్ని పసుపు రంగులోకి మార్చుతుంది:
పసుపును ముఖానికి ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తే.. మీ ముఖం పసుపు రంగులోకి మారుతుంది. ముఖం యొక్క పసుపు రంగు మీ అందాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని ఉపయోగిస్తున్నప్పుడు దాని పరిమాణాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి.
అలెర్జీ :
పసుపును ఉపయోగించిన తర్వాత మీరు నేరుగా బయటకు వెళితే సూర్యరశ్మి వల్ల అది చర్మంపై అలెర్జీని కలిగించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు ముఖానికి పసుపు ఉపయోగిస్తుంటే ఆ తర్వాత వెంటనే ఎండలోకి వెళ్లడం మానుకోండి. తద్వారా మీరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండవచ్చు.
Also Read: జుట్టుకు హెన్నా అప్లై చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
ఇలా ఉపయోగించండి:
పసుపును ముఖానికి చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని వాడటానికి ముందుగా మీకు సులభమైన మార్గాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాము. ఇందుకోసం అర చెంచా పసుపులో కొద్దిగా పాలను కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.