Ashwini Vaishnaw Reviews Maha Kumbh Preparations: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు సిద్ధం అవుతున్నది. వచ్చే నెలలో జరుగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలకు యోగీ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడుకల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులకు రద్దీకి అనుగుణంగా రైళ్లను షెడ్యూల్ చేస్తున్నది. తాజాగా మహా కుంభమేళాకు సంబంధించి రైల్వే అధికారులు చేస్తున్న ఏర్పాట్లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహా కుంభమేళా కోసం 13 వేల రైళ్లు
ప్రయాగ్ రాజ్ లోమహా కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. తొలుత ఝూన్సీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ తర్వాత మహా కుంభమేళా సన్నాహాలను పరిశీలించారు. అనంతరం గంగా నదిపై ప్రయాగ్ రాజ్-వారణాసి రైల్వే మార్గంలో నిర్మిస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జి డబ్లింగ్ పనులను చూశారు. మహా కుంభమేళా కోసం గత రెండు సంవత్సరాలుగా రూ. 5,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతేకాదు, 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైళ్లను నడుపుతున్నట్లు వివరించారు. ఈ 13 వేల రైళ్లలో 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నట్లు తెలిపారు. గత కుంభమేళాలో 7000 రైళ్లను నడిపినట్లు చెప్పిన ఆయన, ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.
రైళ్లకు రెండు వైపులా ఇంజిన్లు
ఇక మహా కుంభమేళాకు షెడ్యూల్ చేసిన సాధారణ రైళ్లలో రెండు వైపుల ఇంజిన్లు ఉంటాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా చాలా సమయం ఆదా అవుతుందన్నారు. దీంతో సమయం ఆదా అవుతుంది. అటు తక్కువ దూరాల నుంచి వచ్చే భక్తుల కోసం పెద్ద మొత్తంలో MEMU రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు స్టేషన్లలో స్టేషన్లలో 43 పర్మినెంట్ హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
महाकुंभ की तैयारी!
झूँसी रेलवे स्टेशन के दूसरे प्रवेश द्वार (2nd entry) और श्रद्धालुओं के लिए स्टेशन के दोनों तरफ होल्डिंग एरिया की व्यवस्था। pic.twitter.com/KSNcoX4IYp
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2024
భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు
పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడా అసౌకర్యం కలగకుండా రైల్వే సంస్థ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్యాసింజర్ వెయిటింగ్ రూమ్ లలో ఫుడ్, వాటర్, మెడికల్ ఏర్పాట్లు, టాయిలెట్స్ వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, మహా కుంభమేళాలో అత్యవసర పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ టీమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఫైర్ టీమ్ తో కేంద్రమంత్రి ఇంపాక్ట్ అయ్యారు. మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి పలు సూచనలు చేశారు. మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి విషయంలోనూ పక్కా ప్లాన్, పర్యవేక్షణ ఉండాలని అధికారులకు రైల్వేమంత్రి సూచించారు. ఈ సందర్భంగా, రైల్వే అనౌన్స్ మెంట్, టికెట్ ఇష్యూ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.
Read Also: ఇంజిన్ లేకుండా వందే భారత్ ట్రైన్ అంత వేగంగా ఎలా ప్రయాణిస్తోంది? సాధారణ రైలుకి దీనికి తేడా ఏమిటి?