Vitamin E Capsules: ప్రతి ఒక్కరూ తమ ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి జీవనశైలి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై మచ్చలు చిన్నవయసులోనే వస్తున్నాయి. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
విటమిన్ ఇ క్యాప్సూల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఫలితంగా చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. చర్మం అందంగా మెరుస్తూ ఉండటానికి ఇవి సహాయపడతాయి.
విటమిన్ ఇ క్యాప్సూల్స్ యొక్క ప్రయోజనాలు:
తేమను అందిస్తుంది:
విటమిన్ ఇ చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
మచ్చలను తగ్గిస్తుంది:
విటమిన్ ఇ క్యాప్సూల్స్ చర్మంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:
విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
చర్మాన్ని రక్షిస్తుంది:
విటమిన్ ఇ సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దుమ్మూ, దూళి కణాల నుంచి రక్షిస్తుంది.
విటమిన్ ఇ క్యాప్సూల్ ఎలా ఉపయోగించాలి ?
చర్మంపై నేరుగా పూయండి: విటమిన్ ఇ క్యాప్సూల్‌ను నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. లిక్విడ్‌ను స్కిన్ పూర్తిగా పీల్చుకునే వరకు మసాజ్ చేయాలి.
ఫేస్ మాస్క్‌లలో కలపండి: మీరు మరేదైనా ఫేస్ ప్యాక్ ముఖానికి వాడుతున్నట్లయితే అందులో కూడా విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను కలపొచ్చు.
Also Read: రైస్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌లో ఇతర ఉపయోగాలు:
కళ్ల కింద నల్లటి వలయాలు: విటమిన్ ఇ క్యాప్సూల్స్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.
ముడతలు: విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి.
జుట్టు కోసం: విటమిన్ ఇ క్యాప్సూల్స్ జుట్టును మృదువుగా , మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.