BigTV English

Rashmi Gautam: జానీ మాస్టర్ కేసులో ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన బ్యూటీ…!

Rashmi Gautam: జానీ మాస్టర్ కేసులో ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన బ్యూటీ…!

Rashmi Gautam : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Jani Master) లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. తన దగ్గర ఉన్న మహిళా కొరియోగ్రాఫర్ పై దాదాపు నాలుగు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ బాధిత యువతి సెప్టెంబర్ 15వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 16వ తేదీన ఈ కేసును రాయదుర్గం నుంచి జీరో ఎఫ్ ఐ ఆర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం బాధిత యువతి వయసు 21 సంవత్సరాలు కావడంతో ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచే తన కామ వాంఛ తీర్చుకున్నాడనే కారణంగా జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేస్ ఫైల్ చేయడంతో పాటు పలు రకాల సెక్షన్ల పై కేసు నమోదు చేసి, చంచల్‌గూడా జైలులో రెండు వారాలు పాటూ రిమాండ్ లో ఉంచారు.


ట్రోలర్స్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్న రష్మి..

ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) చేసిన కామెంట్లను జోడిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మూగ జీవాల సంరక్షణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా తన వీడియోని వైరల్ చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తోంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఈమె చేసిన కామెంట్స్ ను ఇప్పుడు వైరల్ చేయడంతో ఆమె ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.


కాస్టింగ్ కౌచ్ వేరు.. లైంగిక వేధింపులు వేరు..

అసలు విషయంలోకెళితే, గతంలో రష్మీ మాట్లాడుతూ.. మైనర్ ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం, క్యాస్టింగ్ కౌచ్ కి మధ్య చాలా తేడా ఉంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినది. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలా చోట్ల ఉంది. ఇలాంటివి ఎదురైనప్పుడు నో చెప్పాలి. అయితే కొంతమంది కెరియర్‌లో ముందుకెళ్లడానికి ఇలాంటివి ఎదురైనప్పుడు ఓకే చెబుతున్నారు. ఎవరు ఇక్కడ ఎవరిని బలవంతం చేయరు. ఒకవేళ అత్యాచారం చేస్తే తప్పు అంటూ రష్మి చెప్పుకొచ్చింది.

ఎరక్కపోయి ఇరుక్కుపోయిందే..

Rashmi Gautam: Beauty stuck in Johnny Master's case...
Rashmi Gautam: Beauty stuck in Johnny Master’s case…

అయితే ఇటీవల కొరియోగ్రాఫర్ మైనర్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతంలో రష్మిక చేసిన వీడియోని ఈ వార్తలకు జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో ఆమె అది తన పాత ఇంటర్వ్యూ అని , దయచేసి దానిని వైరల్ చేయవద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. మొత్తానికి అయితే గతంలో చేసిన ఈ ఇంటర్వ్యూ ని ఇప్పుడు అడ్డం పెట్టుకొని జానీ మాస్టర్ పై కామెంట్లు చేసింది అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తుండడంతో..ఎరక్కపోయి ఇప్పుడు ఇరుక్కుపోయింది అంటూ నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×