BigTV English

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Perni Nani Reaction: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ సీరియస్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించారు. ‘చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వారి కుట్ర రాజకీయాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు విఫలమైందని, ఆ విషయంపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న ఉద్దేశంతోనే లడ్డూ వివాదాన్ని కావాలనే ఇంతలా క్రియేట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆలయ, రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారు. గతంలో మాదిరిగానే మా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. జులై 17న ఒక ట్యాంకర్ లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపించారు.


Also Read: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

పనికిమాలిన రిపోర్ట్ తీసుకొచ్చి, దేవుడిని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు. నెయ్యిని వెనక్కి పంపామని ఈఓ శ్యామలరావు చెప్పారు. ప్రాయశ్చిత్తం దీక్ష తప్పు చేసినవారు చేస్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాడుబుద్ధితో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ పచ్చి అబద్ధాలు ఆడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాడుబుద్ధితో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటే. దీనిపై ఎలాంటి ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నామని జగన్ ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. సిట్ తో విచారణ చేయించడం కాదు.. మీకు దమ్ముంటే సీబీతో విచారణ జరిపించండి. కూటమి నేతలు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. రానున్న శనివారం.. సెప్టెంబర్ 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పూజల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి’ అంటూ వారు పేర్కొన్నారు.


Also Read: భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశం

‘ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ. 18 వేలు.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాకు వాటిని అమలు చేయడంలేదు. ఈ విషయమై వారు లోలోపల మదన పడుతున్నారు. అందుకే కూటమి నేతలు పాపపరిహార్థం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు. పవన్ కల్యాణ్ గతంలో బాప్టిజం తీసుకున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. జనం ఏది కూడా మరిచిపోరు.

నెయ్యి ధర వెయ్యి రూపాయలంటూ చంద్రబాబు అంటున్నారు. మరి ఆయన హయాంలో ఏనాడైనా అంత ధర పెట్టి కొన్నారా? కొంటే చూపించాలి. వైసీపీ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో నెయ్యిని కొనుగోలు చేశారు’ అంటూ వారు మండిపడ్డారు.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×