BigTV English

Foods in Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్లో పెడితే అవి త్వరగా చెడిపోతాయి, వీటిని తినడం మానుకోండి

Foods in Fridge: ఈ పదార్థాలను ఫ్రిజ్లో పెడితే అవి త్వరగా చెడిపోతాయి, వీటిని తినడం మానుకోండి

Foods in Fridge: మిగిలిపోయిన ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఫ్రిజ్లో పెట్టకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియక ఆహారాలను ఫ్రిజ్లో పెట్టి తినేస్తున్నారు. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్రిజ్లో కొన్ని రకాల ఆహారాలను పెట్టడం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. అలాగే వాటి రుచి కూడా తగ్గిపోతుంది. చల్లని వాతావరణంలో కొన్ని రకాల ఆహారాలు ఫ్రిజ్లో పెట్టి తినకూడదు. అవేంటో తెలుసుకోండి.


వెల్లుల్లి
బిల్లులని ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని బయట ఉంచితేనే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల త్వరగా వెల్లుల్లి మొలకెత్తుతుంది. అలాగే సాగినట్టు మారుతుంది. వెల్లుల్లిని చల్లగా ఉండే పొడి ప్రదేశంలో ఉంచితే చాలు. ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వెల్లుల్లికి గాలి తగులుతూ ఉంటే అవి ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద గాలి చొరబడని కంటైనర్ లో ఉంచినా కూడా మంచిదే. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

అవకాడోలు
అవకాడో పండ్లను కూడా ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది అవకాడోను పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అవకాడోలు పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెడితే అవి అలా పచ్చిగానే ఉండిపోతాయి. అవకాడో ముక్కలు చేశాక దానిని నిల్వ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్ లోనే పెట్టక్కర్లేదు. పైన నిమ్మరసం చల్లి ఆపైన గాలి తగలకుండా మూత పెడితే సరిపోతుంది. కొన్ని గంటలపాటు ఇది తాజాగా నిలవ ఉంటుంది.


తేనె
తేనెను కూడా ఫ్రిజ్లో దాచేవారు ఎంతోమంది. నిజానికి తేనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాడవదు. రుచిని ఆకృతిని మార్చుకోదు. దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల అది స్పటికంగా మారిపోతుంది. స్పటికాకృతిలో మారిన తేనె తినడం అంత మంచిది కాదు. దాన్ని తినడం వల్ల సహజమైన రుచి కూడా రాదు. తేనెను తిన్నా ఫీలింగ్ కూడా మీకు అనిపించదు. కాబట్టి తేనెను ఫ్రిజ్లో పెట్టుకోవడం పూర్తిగా మానుకోండి.

దోసకాయలు
దోసకాయలను ఫ్రిజ్లో పెడితే నీరుకారే అవకాశం ఉంది. అలాగే మెత్తగా కూడా మారిపోతాయి. చలికి దోసకాయలు తట్టుకోలేవు. కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి దోసకాయలను గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడం ఉత్తమం. చల్లని పొడి ప్రదేశంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దోసకాయలు తాజాగా ఉంటాయి.

తులసి ఆకులు
తులసి ఆకులను ఫ్రిజ్లో ఉంచడం వల్ల నల్ల మచ్చలు త్వరగా ఏర్పడతాయి. ఇది రుచి, సువాసనను కోల్పోతాయి. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసు నీటిలో తులసి కొమ్మలను తెంపి పువ్వుల గుత్తి వలె ఉంచితే మంచిది. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. లేదా ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి ఉంచిన అవి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉంది.

ఉల్లిపాయలు
ఉల్లిపాయల్లో తేమను గ్రహించే శక్తి ఎక్కువ. వీటిని ఫ్రిజ్లో పెడితే త్వరగా మెత్తగా మారిపోతాయి. బూజు పట్టేస్తుంది. అలాగే వాటి రుచి కూడా మారిపోతుంది. ఉల్లిపాయలను బయటనే గాలి, వెలుతురు తగిలేలా ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అలాగే బంగాళదుంపలతో కలిపి ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు.

బంగాళాదుంపలు
చల్లని ఉష్ణోగ్రతల్లో అంటే ఫ్రిజ్లో బంగాళదుంపలను ఉంచడం వల్ల వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మారిపోతాయి. అలాగే తీపి రుచి కూడా అసహ్యకరంగా మారుతుంది. వీటిని మీరు తినడం కష్టంగా మారుతుంది. బంగాళదుంపలు నిల్వ చేయడానికి వెంటిలేషన్ వచ్చే ప్రాంతంలో ఉంచితే చాలు. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలను మాత్రం కలిపి ఉంచవద్దు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×