BigTV English

Health Benefits of Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా..? నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు!

Health Benefits of Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా..? నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు!
Walking Barefoot Health Benefits : ఇంటి నుంచి అడుగు బయట వేయాలంటే చెప్పులు కచ్చితంగా ఉండాలి. కాళ్లకు దుమ్ము, దూళి, ఏదైనా గాయాలై పాడవుతాయోమనన్న భయం. పిల్లలు అడుకునేందుకు బయటకు వెళుతున్న.. రేయ్ చెప్పులు వేసుకోరా అని తొడిగెస్తుంటాము. చెప్పాలంటే చెప్పులు కూడా మన లైఫ్‌లో ఒక భాగమైపోయాయి. అయితే మన పెద్దవాళ్లు చెప్పులకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మైళ్ల దూరం చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లేవారు. పొలంలో పనులు చేస్తున్నా ఒట్టి కాళ్లతోనే దిగేవారు. కానీ వాళ్లు ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా హ్యాపీగా జీవించేవారు.


ఇక ప్రస్తుత కాలంలో అయితే ఇంట్లో కూడా కాళ్లకు చెప్పులు ఉండాల్సిందే. అయితే పార్క్‌కి వెళ్లి పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడిచిన అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ బాల్యంలో ఊరిలోనే గడిచిపోయి రోజంతా పాదరక్షలు లేకుండా ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తే అవకాశం ఉంది. కానీ దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు వస్తున్నాయో ఆ సమయంలో పట్టించుకోలేదు. పాదరక్షలు లేకుండా నడవడం మానవ శరీరానికి ఎంత మేలు చేస్తుందో నేడు సైన్స్ కూడా గుర్తించింది. కాబట్టి చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాట్లాడితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎముకలు, కండరాలు మెరుగ్గా ఉంచడానికి చెప్పులు లేకుండా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: ఈ పువ్వుతో షుగర్ వ్యాధి క్షణాల్లో మాయం.. కనిపిస్తే వదలకండి

చెప్పులు లేకుండా నడవడం బాడీ బ్యాలెన్సింగ్, ప్రొప్రియోసెప్షన్, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి అవసరమైన శరీర అవగాహనలో సహాయపడుతుంది. చిన్న పిల్లల పెరుగుదలకు ఈ పద్ధతి చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల తుంటి, మోకాలి కీళ్లు, ఎముకలు మొదలైనవి మెరుగ్గా పని చేస్తాయి.  దీని కారణంగా వాటికి సంబంధించిన అనేక సమస్యలు దూరంగా ఉంటాయి.

మీరు చెప్పులు లేకుండా నడిస్తే అది పాదాలు, చీలమండల కీళ్ల బలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా స్నాయువులు, కండరాలను బలపరుస్తుంది. దీనికి సంబంధించిన సమస్యలు దీర్ఘకాలానికి మిమ్మల్ని బాధించవు.  ఇలా చేయడం వల్ల పాదరక్షల వల్ల వచ్చే సమస్యలు, అరికాళ్లు, చీలమండలు, మోకాళ్లు, వీపు కింది భాగంలో నొప్పులు వంటివి పరిష్కారం అవుతాయి. కాలిలోని ప్రతి కండరం దృఢంగా మారడం వల్ల వెన్నునొప్పి సమస్య సులభంగా పరిష్కారమవుతుంది.

చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:

Also Read : మండుతున్న ఎండలు.. ఈ చిట్కాలు తప్పనిసరి!

మీరు సరిగ్గా నడవడం, చెప్పులు లేకుండా వ్యాయామం చేయడం మొదటిసారి చేస్తుంటే.. దీన్ని నెమ్మదిగా ప్రారంభించండి. అప్పుడు కాలక్రమేణా మీ పాదాలు, వాటికి సంబంధించిన కండరాలు కీళ్లు సర్దుబాటు అవుతాయి. ఈ అలవాటును ఇంటి నుండే ప్రారంభించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ పాదం క్రమంగా సురక్షితమైన ఉపరితలం అలవాటును అంగీకరిస్తుంది.

మీరు బయట నడవాలనుకుంటే రబ్బరు నేల, గడ్డి పొలాలు లేదా ఇసుక ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవండి. ఏదైనా గాయం అయితే అజాగ్రత్తగా ఉండకండి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. ప్రతి రాత్రి గోరువెచ్చని నీటితో కంప్రెస్ చేయండి. భద్రతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే దీన్ని చేయండి.

Disclaimer: ఈ కథనాన్ని నిపుణుల సలహాల మేరకు, పలు జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా  అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×