E-Paper
Advertisement

Ramadan Celebration 2024: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్గాల వద్ద సందడి!

Ramadan Celebration 2024: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్గాల వద్ద సందడి!
Advertisement

Ramadan Festival celebrations 2024: దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్దలతో ప్రార్ధనలు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, సహా పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచే రంజాన్ సందడి మొదలైంది. ఇఫ్తార్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్దనలు చేసుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చార్మినార్, మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్దనలు చేశారు.

రంజాన్ పండుగ విశేషాలు.. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెలలో అత్యంత పవిత్రంగా జరిగే పండుగ రంజాన్ .. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం, ప్రార్ధన, ప్రతిబింబానికి చిహ్నంగా రంజాన్ ను పరిగణిస్తారు. ఇస్లాంలోని ఐదు మూల స్తంభాలలో ఒకటిగా రంజాన్ ను పరిగణించాలని ప్రవక్త చెబుతారు. సోమ్ అని పిలువబడే ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమై సూర్యాస్తమయానికి ముగుస్తుంది.

Advertisement

Also Read: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

ఈ మాసం అంతా ముస్లింలు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. దీని వల్ల క్రమశిక్షణ, ఆధ్యాత్మక పెరుగుతాయి. తెల్లవారుజామున సుహూర్, సూర్యాస్తమయం తరువాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. దాతృత్వం, మంచి పనులకు రంజాన్ అత్యుత్తమ సమయం. రాత్రి సమయంలో ప్రార్దనలను మసీదులో తరావీహ్ పేరుతో చేస్తారు. రంజాన్ చివరి పది రోజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈద్ అల్-ఫితర్ పండుగతో రంజాన్ మాసం ముగుస్తుంది.

Advertisement

ఈద్ అల్-ఫితర్ ఆచారం ఎలా వచ్చిందంటే.. ఈద్ అల్-ఫితర్ సమయంలో తీపి వంటకాలు చేసుకుని ముఖ్యంగా ఖీర్ ను తయారు చేస్తారు. ఇంట్లో తయారు చేసిన రక రకాల వంటకాలు ప్రేమగా వడ్డిస్తారు. ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు అల్లాను ఆరాధించడానికి.. అతని మార్గాన్ని అనుసరించడానికి ఈ పండుగను జరుపుకుంటారు.

Tags

Related News

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

Big Stories

Advertisement
×