Big Stories

Green Tea in Summer: వేసవిలో గ్రీన్‌ టీ తాగితే ఏం అవుతుంది..?

Green Tea in Summer: వేసవి కాలంలో బరువు తగ్గడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఎంత సేపు వర్కవుట్ చేస్తే అంత చెమట శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అంతేకాదు వేసవికాలంలో చెడు కొలస్ట్రాల్ తగ్గించుకునేందుకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. వేసవిలో దొరికే పండ్లు, కూరగాయలతో కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో బరువు తగ్గాలనుకునే వారు మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే సమ్మర్ లో బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందట. అయితే గ్రీన్ టీని అసలు వేసవికాలంలో తాగొచ్చా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

గ్రీన్ టీ..

- Advertisement -

సాధారణంగా తీసుకునే కాఫీ, టీలలో గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలోని కొవ్వును కరిగించడానికి గ్రీన్ టీ తోడ్పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. అంతేకాదు గ్రీన్ టీతో కడుపులోని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయాలని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీని తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా వేసవి కాలంలో తాగడం మంచిదే అని చాలా మందికి అనుమానం ఉంటుంది. అయితే వేసవిలోనే కాకుండా ఏ సీజన్ లో అయినా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవట. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. వేసవిలో ఉండే వేడి నుంచి ఉపశమనం కోసం గ్రీన్ టీని తాగడం ఉత్తమం అంటున్నారు.

Also Read: HeatWave: వేసవిలో గుండెకు రిస్క్..హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న మరణాలు

శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గించి, హైడ్రేటెడ్ గా ఉంచేందుకు కూడా గ్రీన్ టీ తోడ్పడుతుంది. అంతేకాదు జీర్ణసమస్యలు వంటి వాటిని కూడా దూరం చేస్తుందట. శరీరంలోని వ్యర్థ పదార్థాలను కూడా తొలగించడానికి తోడ్పడుతుంది. గ్రీన్ టీతో అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అయితే వేసవిలో ఎక్కువగా కాకుండా కేవలం రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, సాయంత్రం లేదా రాత్రి ఒకసారి తాగాలని సూచిస్తున్నారు. వేసవిలో గ్రీన్ టీని అధికంగా తీసుకోకూడదని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News