Big Stories

Amit Shah Comments on BRS, Congress: అమిత్ షా.. ఆ పార్టీలపై సెటైర్లు, కౌంటర్లు కూడా..

Amitshah Comments on BRS, Congress: తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ నేతలు ఇటు ఏపీ, అటు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. భువనగిరి సభలో అమిత్ షా చేసిన ఆరోపణలపై  కాంగ్రెస్ వాదులు నవ్వుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు హామీలు అమలు కాలేదని దుయ్యబట్టారు అమిత్ షా. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఏటా 15 వేల ఆర్థిక సాయం, వరి, గోదుమ లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఆ పార్టీ 70 ఏళ్ల అయోధ్య అంశాన్ని కూడా పక్కనపెట్టిందంటూ మరోసారి ఆరోపించారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ పిల్ల చేష్టల గ్యారెంటీలు- మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా వర్ణించారు.

- Advertisement -

ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు అమిత్ షా. ఈసారి తెలంగాణలో 10 సీట్లలో గెలుపొందుతామని మనసులోని మాట బయటపెట్టారు. అబద్దాలతో గెలవడానికి హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రిజర్వేషన్లను తొలగిస్తారంటూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

Also Read: Delhi High Court : ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో ?

370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ముకాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని ముట్టుబెట్టామన్నారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక తానులోని ముక్కలేనని, వీరి మధ్య త్రికోణ బంధం ఉందన్నారు. ఈ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినం చేయవని, రద్దు చేసే త్రిపుల్ తలాక్‌ను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు నవ్వుకుంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ వాదులు. మూడునెలలు పూర్తి కాగానే మార్చిలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, ఈ లెక్కన షా చెప్పిన పథకాలు ఎవరైనా అమలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ను ఐదేళ్లలో పూర్తి చేసి, మళ్లీ పార్టీలు ఎన్నికలకు వెళ్తాయి. ఈ లాజిక్‌ను పెద్దాయన ఎలా మరిచిపోయారని అంటున్నారు పలువురు నేతలు.

Also Read: నవనీత్‌కు అసదుద్దీన్ కౌంటర్.. ఎనీ ప్లేస్ రెడీ

కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదన్న దానిపై కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ వాదులు. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా వెనుక ఏం జరిగిందో అందరికీ తెలుసని, పూరిలో అభ్యర్థి తప్పుకోవడం వెనుక మోదీ సర్కార్ ప్రమేయం లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసిందెవరు సూటిగా ప్రశ్నించారు. చేయాల్సినవన్నీ చేసి తమ పార్టీపై నిందలు ఎందుకన్నది కాంగ్రెస్ వాదుల నుంచి బలంగా వినిబడుతున్న ప్రశ్నలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News