Big Stories

White Onion: తెల్ల ఉల్లిపాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె జబ్బులకు చెక్..

White Onion
White Onion

White Onion: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత వింటే నిజమనే అనిపిస్తుంది. ఉల్లిలో ఉండే అనేక పోషకాలు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కేవలం వంటల్లో మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ శరీరంలోని అన్ని భాగాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా చర్మం, జుట్టు, కళ్లు, లివర్, గుండె సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లకు బలంగా మార్చేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా.. చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసేందుకు దీనిని ఉపయోగించవచ్చు.

- Advertisement -

తెల్ల ఉల్లిపాయలో పొటాషియం, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తెల్ల ఉల్లిని తినడం వల్ల శరీరంలోని కణాలను రక్షించడంలో తోడ్పడుతుంది. ఉల్లితో శరీర ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇందులో తెలుసుకుందాం.

- Advertisement -

క్యాన్సర్:

ఉల్లిలో చాలా పోషకాలు ఉంటాయి. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాదు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. మరోవైపు శరీరంలో ఇతర కారణాల వల్ల దెబ్బతిన్న కణాలను రక్షిస్తుంది.

జీర్ణక్రియ:

తెల్ల ఉల్లిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఉల్లిని తరచూ తీసుకునే ఆహార పదార్థాల్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది. అందువల్ల తరచూ ఆహారంలో ఉల్లిపాయను తప్పక తీసుకోవాలి. మరోవైపు శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గించొచ్చు.

Also Read: పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ట్రై చేయండి

గుండె ఆరోగ్యం:

తెల్ల ఉల్లిలో ఉండే క్వెర్వెటియన్ అనే ప్లేవనాయిడ్స్ రక్తపోటును తగ్గించి, చెడు కొలస్ట్రాల్ ను నియంత్రించడానికి తోడ్పడుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎముకలు, దంతాలు, చర్మం, జుట్టు బలంగా, ఉంటాయి.

రోగనిరోధకశక్తి:

ఉల్లితో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీని వల్ల అంటువ్యాధులు, వైరస్ వంటి వాటితో పోరాడేందుకు శరీరానికి శక్తి లభిస్తుంది. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.

జుట్టు, చర్మం సమస్యలు :

ఉల్లితో జుట్టు, చర్మం సమస్యలకు చెక్ పెట్టొచ్చనే విషయం అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ గుజ్జును జుట్టుకు పట్టించడం ద్వారా జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. ఉల్లి పేస్టుతో చుండ్రు, జుట్టు రాలడాన్ని తగ్గించి.. బలంగా, మృదువుగా మార్చుకోవచ్చు. ఉల్లిపాయను షాంపులా కూడా వాడుకోవచ్చు. ఇక చర్మానికి ఉల్లి రసాన్ని టోనర్ గా వాడుతారు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అందువల్ల మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రొడెక్ట్ లలో ఉల్లి రసాన్ని ఉపయోగించి టోనర్ తయారు చేసినవి కూడా దొరుకుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News