Alum Benefits: పటిక అనేది ఒక సాంప్రదాయ ఔషధం. దీనిని ఇళ్లలో నీటిని శుద్ధి చేయడానికి లేదా షేవింగ్ తర్వాత ఉపయోగిస్తారు. కానీ ఈ తెల్లటి స్ఫటికం అనేక ఆరోగ్య, గృహ సమస్యలకు సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం అని మీకు తెలుసా? ఆయుర్వేదంలో.. పటికను శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలకంగా పరిగణిస్తారు.
గాయాల నుండి పంటి నొప్పి వరకు.. చెడు చెమట వాసన నుండి నోటి పూతల వరకు, పటిక అన్ని రకాల సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడతాయి.
పటిక యొక్క ప్రయోజనాలు:
నోటి పూత సమస్యలు:
మీ నోటిలో చిన్న చిన్న పుండ్లు ఉంటే.. ఒక చిన్న పటిక ముక్కను నీటిలో కరిగించి, దానితో పుక్కిలించండి లేదా పుండ్ల మీద సున్నితంగా పటకను రాయండి. ఇందులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్‌ను తొలగించి మంటను తగ్గిస్తాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే, బొబ్బలు కొన్ని రోజుల్లోనే మానిపోతాయి. దీనిని ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం వల్ల కూడా అనేక నష్టాలు ఉంటాయి.
చెమట వాసనను తొలగించండి:
మీకు విపరీతంగా చెమటలు పట్టి, మీ శరీరం నుండి దుర్వాసన వస్తుంటే.. పటిక పొడిని తయారు చేసి, మీ అండర్ ఆర్మ్స్ లేదా పాదాలకు అప్లై చేయండి. ఇది చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. మీకు కావాలంటే.. మీరు స్నానం నీటిలో పటికను కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి సహజ దుర్గంధనాశనిలా పనిచేస్తుంది.
పంటి నొప్పి, వాచిన చిగుళ్ళ నుండి ఉపశమనం:
పటికను నీటిలో మరిగించి, చల్లబరిచి, ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇది పంటి నొప్పి, చిగుళ్ల వాపు, దుర్వాసనను తగ్గిస్తుంది. పటికలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా దంత క్షయాలను కూడా నివారిస్తాయి. ఇలా రోజుకు ఒకసారి నోరు శుభ్రం చేసుకోవడం వల్ల మీ నోరు కూడా శుభ్రంగా ఉంటుంది.
జుట్టు నుండి పేలను తొలగించడం:
పిల్లలు లేదా పెద్దల జుట్టులో పేలు ఉంటే.. పటిక , కర్పూరం రుబ్బి తలకు రాసి కొంత సమయం తర్వాత తలస్నానం చేయాలి. ఇది పేను , వాటి లార్వాలను చంపుతుంది. ఇది తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. వారానికి ఒకసారి ఈ హోం రెమెడీస్ పాటిస్తే మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: చర్మ ఆరోగ్యానికి ఎండు ద్రాక్ష ఎలా ఉపయోగపడుతుందంటే ?
పగిలిన మడమల చికిత్స:
పాన్ మీద పటికను వేడి చేయండి. అది ఉబ్బి నురగుగా మారినప్పుడు, దానిని చల్లబరిచి పొడిగా చేయండి. దీనిని కొబ్బరి నూనెతో కలిపి మడమల మీద రాయండి. ఇది పగుళ్లను నయం చేస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ హోం రెమెడీని వాడండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది వాడటం వల్ల మీ మడమలు కొన్ని రోజుల్లోనే మృదువుగా మారుతాయి.
గాయాలు, రక్తస్రావం:
ఎవరికైనా చిన్న గాయం అయితే లేదా గాయం నుండి రక్తస్రావం అయితే.. ఆ ప్రదేశంలో పటికను రుద్దండి లేదా దాని పొడిని చల్లుకోండి. ఇది రక్తస్రావం ఆగి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. దీని యాంటీసెప్టిక్ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. ఈ పద్ధతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.