Pawan Kalyan:..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ.. మరొకవైపు తాను నటించాల్సిన మూడు సినిమాలను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ముందుగా హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత ఓజీ, ఉస్తాద్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలను పూర్తి చేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకోమని ఈ చిత్రాల దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చారట. ఇక ఇంతవరకు ఓకే.. ఈ విషయంపై అభిమానులు కూడా ఫుల్ హ్యాపీ. పవన్ నుంచీ మరో రెండు సినిమాలు వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక సినిమా తర్వాత మరొక సినిమా మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్.. నెక్స్ట్ ఏంటి..?
అయితే ఇదంతా ఓకే.. ఆ నెక్స్ట్ ఏంటి..? పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉంది? ఒప్పుకున్న మేరకు సినిమాలు చేసేసి ఆ తర్వాత ఆపేయాలని అనుకుంటున్నారా? లేదా మళ్లీ సినిమాలు కంటిన్యూ చేస్తారా? లేదా పూర్తిస్థాయిలో రాజకీయాలకే అంకితమైపోదాం అనుకుంటున్నారా? అని అడిగితే.. జనసేన వర్గాల నుంచి మాత్రం అవుననే వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని రోజులపాటు అటు సినిమాలకు ఇటు హైదరాబాద్ కి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట. మంత్రి పదవుల బాధ్యత నిర్వహణ, పార్టీ వ్యవహారాలు, జనంలోకి వెళ్లడం ఇలాంటి వాటికి పూర్తిగా సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి సినిమాలు ఇక చేయరా అంటే డౌటే అని కూడా చెబుతున్నారు.
ALSO READ: Thug Life: థగ్ లైఫ్ మూవీలో ఈ స్టార్స్ కూడానా.. ట్రైలర్ లో మిస్ అయ్యారే..!
అదే చివరి సినిమా కానుందా..?
ఒకవేళ 2029 ఎన్నికలకు ముందుగా ఏదైనా మంచి సబ్జెక్టు దొరికితే చేసే అవకాశం ఉంటుందేమో.. అలాంటి సబ్జెక్టు దొరికి తన స్నేహితుడు త్రివిక్రమ్ (Trivikram) సినిమా చేయమని కోరితే.. పవన్ కాదని అనలేరేమో.. మరి అలాంటి అవకాశం ఉంది అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ పొలిటిషన్ గా మారిపోయారు. జనసేన పార్టీని మరింత విస్తృతం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందులో భాగంగానే జనాల్లో తనకున్న క్రేజ్ ను నిలబెట్టుకోవాలని ముఖ్యంగా నాయకుడిగా బలమైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక అందులో భాగంగానే..కేంద్రంలో గనుక కీలకపాత్ర వహించడానికి వెళ్తే ఇక సినిమాలు చేయడం కుదరదు.. అన్ని విధాలా చూసుకున్న పవన్ కళ్యాణ్ ఆఖరి సినిమా ఉస్తాద్ కావచ్చు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పొలిటికల్ స్టార్ గానే పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శనం ఇస్తారేమో చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు.ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి భారీ అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక.. పవన్ నుంచీ రాబోతున్న తొలి సినిమా కావడంతో అభిమానులు సైతం చాలా ఎక్సైటింగ్ గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.