E-Paper
Advertisement

మఖానా తింటే లాభమే కాదు నష్టం కూడా ఉంది.. ఈ 5 రకాల సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా తినొద్దు!

మఖానా తింటే లాభమే కాదు నష్టం కూడా ఉంది.. ఈ 5 రకాల సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా తినొద్దు!
Advertisement

Makhana Side Effects: ఈ మధ్యకాలంలో హెల్దీ స్నాక్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మఖానా. వీటినే తామర గింజలు అని కూడా పిలుస్తుంటారు. క్యాలరీలు తక్కువగా ఉంటాయని, పోషకాలు మెండుగా ఉంటాయని డైట్ చేసేవాళ్లు వీటిని బాగా తింటున్నారు. నిజానికి మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అందరి శరీర తత్వం ఒకేలా ఉండదు కదా. కొందరికి ఈ సూపర్ ఫుడ్ లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. మరి ఎవరు మఖానాకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..

జీర్ణ సమస్యలు ఉన్నవారు:

మఖానాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అంత త్వరగా అరగవు. ఇప్పటికే గ్యాస్, అజీర్తి, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవాళ్లు మఖానా తింటే ఆ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మసాలాలు వేసి వేయించిన మఖానాను ఎక్కువగా తింటే కడుపులో మంట వస్తుంది. కాబట్టి.. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవాళ్లు వీటిని చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.

లో బీపీ బాధితులు:

Advertisement

సాధారణంగా మఖానా రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. హై బీపీ ఉన్నవారికి ఇది మంచిదే కానీ, ఇప్పటికే లో బీపీ సమస్య ఉన్నవారికి మాత్రం ఇది ప్రమాదకరం. వీటిని రోజూ తినడం వల్ల బీపీ మరింత పడిపోయి తలతిరగడం, నీరసం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే లో బీపీ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా తర్వాతే వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.

Also Read: రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

కిడ్నీ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు:

Advertisement

కిడ్నీ వ్యాధులతో బాధపడేవారి శరీరంలో పొటాషియం, ఫాస్పరస్ స్థాయిలు అదుపులో ఉండాలి. మఖానాలో ఈ ఖనిజాలు ఉంటాయి కాబట్టి.. కిడ్నీ పేషెంట్లు వీటిని ఎక్కువగా తింటే గుండె వేగంలో మార్పులు, నీరసం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఫుడ్ అలర్జీలు ఉన్నవాళ్లకు మఖానా తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, వికారం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తినడం ఆపేయాలి.

బరువు తగ్గాలని అతిగా తినేవారు:

బరువు తగ్గాలనే ఆశతో కొందరు రోజంతా మఖానానే తింటుంటారు. ఇందులో ప్రొటీన్లు, మంచి కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం వీటిపైనే ఆధారపడితే శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు అందవు. పైగా పొడిగా ఉండే వీటిని అతిగా తినడం వల్ల మలబద్ధకం వస్తుంది. ఏదైనా మితంగా తిన్నప్పుడే అది అమృతంలా పనిచేస్తుందని గుర్తుంచుకోండి.

Also Read: చిరు వ్యాపారులకు NPCI బంపర్ ఆఫర్.. యూపీఐ వాడితే ఇకపై క్యాష్‌బ్యాక్, సౌండ్ బాక్స్ ఫ్రీ!

Tags

Related News

అచ్చమైన పల్లెటూరి రుచిలో..నోరూరించే చేమగడ్డ పులుసు

వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉండే..కంది పచ్చడి

హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?

క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు

రామాయణంలో జటాయువు గోళ్లు రావణుడు ఎందుకు తీసుకున్నాడు? ఇదే అసలు కారణం

పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఏఐని ప్రయోగించిన తండ్రి.. సూపర్ ఐడియా

చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి

Big Stories

Advertisement
×