Garlic Chutney Recipe: వెల్లుల్లి పచ్చడి పేరు వింటేనే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పరాటా అయినా, వేడివేడి అన్నమైనా, ఇతర స్నాక్స్ అయినా పక్కన కాస్త వెల్లుల్లి కారం ఉంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. అయితే, ఎంత ఇష్టమున్నా సరే.. ఇది తిన్న తర్వాత వచ్చే ఘాటు వాసన కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి ఆ వాసన ఎంతసేపటికీ తగ్గకపోవడంతో నలుగురిలో మాట్లాడాటానికే జంకుతారు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ గుణాల వల్లే ఈ ఘాటు, నోటి దుర్వాసన వస్తాయి. కానీ పచ్చడి చేసేటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
పచ్చి వెల్లుల్లి వాసన మీకు నచ్చకపోతే.. పచ్చడి నూరే ముందు వెల్లుల్లి రెబ్బలను కాస్త దోరగా వేయించండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలోని పచ్చిదనం, విపరీతమైన ఘాటు తగ్గుతాయి. అయితే, అవి మరీ మాడిపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే పచ్చడి చేదుగా మారుతుంది. అంతేకాదు.. పచ్చడిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే ఆ పులుపు వెల్లుల్లి ఘాటును తగ్గించి, పచ్చడికి మరింత అద్భుతమైన రుచిని ఇస్తుంది.
వెల్లుల్లి పచ్చడి చేసేటప్పుడు అందులో కాస్త పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి రుబ్బుకోవాలి. దీనివల్ల పచ్చడి రుచి పెరగడమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. ముఖ్యంగా పుదీనాలో ఉండే సహజమైన ఫ్రెష్‌నెస్ నోటి దుర్వాసనను తక్షణమే తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
Also Read: మఖానా తింటే లాభమే కాదు నష్టం కూడా ఉంది.. ఈ 5 రకాల సమస్యలు ఉన్నవాళ్లు పొరపాటున కూడా తినొద్దు!
మీరు మరీ ఎక్కువ కారం, ఘాటు తినలేకపోతే పచ్చడిలో కొద్దిగా తాజా పెరుగు కలుపుకోవచ్చు. పెరుగు కలపడం వల్ల పచ్చడి క్రీమీగా, కమ్మగా మారుతుంది. ఇది వెల్లుల్లి వేడిని, ఘాటును బ్యాలెన్స్ చేసి కడుపుకు కూడా హాయినిస్తుంది.
పచ్చడి తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వెంటనే నీళ్లతో బాగా పుక్కిలించి, నాలుకను, దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని తాజా పుదీనా ఆకులు నమలడం లేదా కాస్త పాలు తాగడం చేస్తే నోటి దుర్వాసన పూర్తిగా మాయమవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. ఇకపై ఎలాంటి భయం లేకుండా వెల్లుల్లి పచ్చడిని హాయిగా ఆస్వాదించండి.
Also Read: ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వెజిటబుల్ దలియా.. రుచి అద్భుతం!