Face Reading Kids| కొంతమంది పిల్లలు పుట్టుకతోనే తెలివైనవారుగా ఉంటారు. అలాంటి పిల్లలు ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తుంటారు. మనం ఏమీ చెప్పకపోయినా మన ముఖం చూసి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తారు. అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారా? బాధలో ఉన్నారా? ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అనేది వెంటనే గుర్తిస్తారు. ఎదుటివారి ముఖ కవళికలను బట్టి వారి భావాలను అర్థం చేసుకునే ఈ లక్షణాన్ని ఫేస్ రీడింగ్ అంటారు. న్యూమరాలజీ (అంకశాస్త్రం) ప్రకారం.. కొన్ని మూలాంకాల పిల్లల్లో ఈ ప్రత్యేకత ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ మూలాంకాలు ఏవో తెలుసుకుందాం.
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 2 అవుతుంది. ఈ మూలాంకానికి చంద్రుడు అధిపతి. చంద్రుడు భావోద్వేగాలు, సున్నితత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ మూలాంకం పిల్లలు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారి ముఖ కవళికలను నిశితంగా గమనిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బాధలో ఉన్నప్పుడు వెంటనే గుర్తిస్తారు. వారి మాటల్లో మార్పు వచ్చినా, ముఖంలో చిరునవ్వు తగ్గినా ఇట్టే పసిగడతారు. ఇతరుల బాధను కూడా అర్థం చేసుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. అందరితో ప్రేమగా, స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు.
6, 15, 24 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 6 అవుతుంది. ఈ మూలాంకానికి శుక్రుడు అధిపతి. అంకశాస్త్రం ప్రకారం.. శుక్రుడు ప్రేమ, అనురాగం, అందమైన బంధాలకు ప్రతీక. ఈ మూలాంకం పిల్లలు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు త్వరగా గుర్తిస్తారు.
అమ్మానాన్నల ముఖంలో ఆందోళన కనిపిస్తే వారిని నవ్వించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమగా మాట్లాడటం, దగ్గరుండి ధైర్యం చెప్పడం వంటి పనులు చేస్తారు. ఇతరుల అవసరాలను గుర్తించి సహాయం చేయడానికి ముందుంటారు.
Also Read: పిల్లలు పబ్లిక్ ప్లేస్‌లో మొండి చేస్తున్నారా? ఈ టిప్స్‌తో సులభంగా హ్యాండిల్ చేయండి
7, 16, 25 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 7 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం.. ఈ మూలాంకానికి కేతువు అధిపతి. ఈ మూలాంకం పిల్లలు సాధారణంగా ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉంటారని చెబుతారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే స్వభావం కలిగి ఉంటారు. ఎదుటివారి ముఖ కవళికలు, చూపులు, మాట్లాడే విధానాన్ని గమనిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైనా ఆందోళనలో ఉన్నప్పుడు త్వరగా గుర్తిస్తారు. వారికి ఎలా సహాయం చేయాలా అని ఆలోచిస్తుంటారు.
Also Read: మనసులో ఒకటి, మెదడులో మరొకటి.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిర్ణయాల్లో తడబడుతుంటారు
మీ పిల్లలు ఈ మూడు మూలాంకాల్లో ఏదైనా కలిగి ఉంటే, న్యూమరాలజీ ప్రకారం వారిలో ఇతరుల భావాలను అర్థం చేసుకునే లక్షణాలు ఉండవచ్చు. అయితే ఒకే మూలాంకం ఉన్న పిల్లలందరి స్వభావం ఒకేలా ఉండదు. పిల్లల వ్యక్తిత్వంపై పెంపకం, కుటుంబ వాతావరణం, అనుభవాలు కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి వారి భావాలను అర్థం చేసుకుంటూ, మనసులోని విషయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కల్పించాలి.