E-Paper
Advertisement

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?
Advertisement

Mohsin Naqvi missing from U19 Asia Cup trophy presentation:  అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ 2026 (ACC Men’s U19 Asia Cup 2026)  విజేతగా టీమిండియా జూనియర్ జట్టు నిలిచింది. పాకిస్తాన్ తో ఒమన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో టీమిండియా గెలిచి, ఛాంపియన్ గా నిలిచింది. ఈ తరుణంలోనే భారత జూనియర్ క్రికెటర్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. అటు భారత దేశంలోనూ క్రికెట్ ఫ్యాన్స్ పటాకులు పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆసియా కప్ గెలిచినా ట్రోఫీ తీసుకోకుండానే రెండుసార్లు టీమిండియా జట్లు వెనుదిరిగాయి. కానీ అండర్ 19 టీమిండియా మాత్రం టైటిల్ తీసుకునే వస్తోంది. దీంతో ప్లేయర్ల ఉత్సాహాం రెట్టింపు అయింది.

అండర్ 19 ఆసియా కప్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ ఎందుకు ఇవ్వలేదంటే?

అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ 2026 విజేతగా నిలిచిన టీమిండియాకు మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ అందించలేదు. అతడు మ్యాచ్ కు హాజరుకాకపోవడంతో నఖ్వీ స్థానంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి షేక్ అబ్దులజీజ్ బిన్ సౌద్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. శనివారం రోజున పాకిస్తాన్ కేబినేట్, ఇతర కార్యక్రమాలు ఉన్నాయని సమాచారం. అందుకే ఒమన్ లోని మస్కట్ లో జరిగిన ట్రోఫీ ప్రధానోత్సవానికి మొహ్సిన్ నఖ్వీ రాలేకపోయాడు. నఖ్వీ హాజరుకాకపోవడం టీమిండియాకు కలిసి వచ్చింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి షేక్ అబ్దులజీజ్ బిన్ సౌద్ చేతుల మీదుగానే ట్రోఫీని తీసుకున్నారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

గతంలో రెండుసార్లు ట్రోఫీ తీసుకోకుండానే వెనుదిగిన భారత్

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో మొహ్సిన్ నఖ్వీ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆసియా కప్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా నఖ్వీనే ట్రోఫీని అందించాల్సి ఉంటుంది. అయితే, రెండు దేశాల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో దాయాది జట్టు ప్లేయర్లకు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు. ఈ తరుణంలోనే 2025లో జరిగిన పురుషుల ఆసియా కప్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచిన సూర్య కుమార్ యాదవ్ సేన, ట్రోఫీ తీసుకోలేదు.  మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు బీసీసీఐ నుంచి రావడంతో సూర్య సేన ఉట్టి చేతులతోనే ఇండియాకు వచ్చింది. 2026 హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు కూడా ఛాంపియన్ గా నిలిచి, చేతులు ఊపుకుంటూ వచ్చింది. కానీ ఈ సారి నఖ్వీ గైర్హాజరు కావడంతో అండర్ 19 టీమిండియాకు ట్రోఫీ దక్కింది. పహల్గమ్ సంఘటన జరిగిన తర్వాతనే రెండు దేశాల మధ్య ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

హంజాపై టీమిండియా ప్లేయర్ దాడి? స్టేడియం నుంచి పారిపోయిన పాక్ ఆటగాళ్లు

పాక్ పై టీమిండియా ‘దండ్రయాత్ర’..9వ సారి ఆసియా కప్ మనదే

“అబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్” పేరుతో పాకిస్తాన్ దొంగాట‌..ప‌గ‌ల‌బడి నవ్విన‌ ఆర్య‌వీర్ సెహ్వాగ్

బాబ‌ర్ ఆజం బ్యాటింగ్ చేస్తుండ‌గా…క‌ట్ డ్రాయ‌ర్లు, బ‌నియ‌న్ల‌, నైటీల విజువ‌ల్స్‌

న్యూజిలాండ్ పైనే చేతులెత్తేశారు…రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు

బీసీసీఐ అండ‌తో రౌడీల్లా రెచ్చిపోతున్నారు..గుర్నూర్ బ్రార్ పై కమ్రాన్ ఆగ్ర‌హం

హార్దిక్ పాండ్యా భార్య‌ నటాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం? డ‌బ్బులు తీసుకుని ప్రియుడితో జ‌ల్సాలు!

Big Stories

Advertisement
×