Karnataka News: ట్రెండ్ మారింది.. జైలుకి వెళ్లిన రాజకీయ నాయకుల దారిలో నడుస్తున్నారు కొందరు నిందితులు. ఏదైనా కేసులో జైలుకి వెళ్లినవారు సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోతారు. తమ ముఖానికి ఎవరికీ చూపించలేదు. కానీ ఆ నిందితుడు మాత్రం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్ల ర్యాలీ చేపట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని హవేరి జిల్లాలో గతేడాది జనవరి 8న హోటల్ గదిలో ఉండగా ఓ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్ అయిన తన భాగస్వామితో కలిసి హోటల్‌కి వెళ్లాడు. ఆ తర్వాత ఆ జంటకు-వ్యక్తులకు మధ్య మాటల వాగ్వాదం జరిగింది. చివరకు మహిళను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరో మూడు రోజుల తర్వాత అంటే జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. దీని ఆధారంగా గ్యాంగ్ రేప్ నిందితులపై పలు సెక్షన్లను చేర్చారు. విచారణ సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు.
వారిలో డజను మందికి పది నెలల కిందట బెయిల్ వచ్చింది. మిగిలిన ఏడుగురు ప్రధాన నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నారు. వారిలో అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా, తౌసిప్ చోటి, రియాజ్ సవికేరిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ: పరోటాతో ఉచిత గ్రేవీ ఇవ్వలేదని రెస్టారెంటుపై కేసు
ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. అయితే ఇటీవల వీరికి బెయిల్ వచ్చింది. జైలు నుంచి హవేరిలోని ఆలూర్ పట్టణంలో కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఓపెన్ టాప్ కారులో నిందితుడు నవ్వుతూ, చేతులతో విజయ సంకేతాలు చూపుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఇప్పుడు దుమారం మొదలైంది. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
हावेरी, कर्नाटक में गैंग रेप आरोपियों ने कई कारों और मोटरसाइकिलों का “विजय जुलूस” निकाला, वीडियो शेयर करके दावा किया कि वो अपने “अच्छे संपर्कों” के चलते छूट गये
आरोपियों के नाम ~ आफ़ताब अहमद, मोहम्मद सादिक़, शोएब मुल्ला, तौसीफ़, समीउल्ला, मदार और वयास pic.twitter.com/r3ZIHLrQSt
— ANUPAM MISHRA (@scribe9104) May 23, 2025