BigTV English

Kavitha : నెక్ట్స్ ఏంటి? కేసీఆర్‌‌కు కవిత కిరికిరి!

Kavitha : నెక్ట్స్ ఏంటి? కేసీఆర్‌‌కు కవిత కిరికిరి!

Kavitha : తెలంగాణ పాలిటిక్స్‌లో కవిత లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. KCRకు కవిత రాసిన లేఖను బిగ్‌టీవీ వెలుగులోకి తెచ్చింది. కవిత లేఖపై సీనియర్ లీడర్లతో KCR ఇప్పటికే చర్చలు జరిపారు. లేఖ విషయంలో ఎలా స్పందించాలన్న దానిపై మాట్లాడారు. కవిత రాసిన నెగిటివ్ పాయింట్స్‌పై KCR రియాక్ట్ అవుతారా? అనే అంశాలపై BRSలో చర్చ జరుగుతోంది.


ఆ ప్రశ్నలకు బదులేది?

పార్టీ ఆవిర్భావ సభలో BJPపై 2 నిమిషాలే ఎందుకు మాట్లాడారు? BJP-BRS పొత్తుపై కవిత ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తారా? పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారన్న దానికి ఆన్సర్ ఏంటి? బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదన్న దానికి రియాక్షన్ ఏంటి? వక్ఫ్ బిల్లుపైనా మాట్లాడలేదంటూ కవిత ప్రస్తావించడాన్ని ఎలా తీసుకుంటారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి.


కారులో కల్లోలం..

కవిత లేఖపై ఏం మాట్లాడితే ఏమౌతుందోనన్న టెన్షన్‌లో BRS నేతలు ఉన్నారు. పార్టీలో జరుగుతున్నదే కవిత రాశారంటూ చర్చించుకుంటున్నారు. ఇటు కవితకు సపోర్ట్‌గా మాట్లాడలేదు. అటు, కవితను సమర్థించనూ లేరు. ఏం మాట్లాడితే ఏమవుతుందో? ఎవరికి కోపం వస్తుందో? అనుకుంటూ మౌనంగా ఉండిపోతున్నారు. కేసీఆర్ మాత్రమే ఈ లేఖపై ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కవిత రియాక్షన్ ఏంటి?

ఇక, శుక్రవారం రాత్రికి అమెరికా నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. రాగానే లేఖపై బహిరంగంగా స్పందిస్తారా? లెటర్ రాసింది తానేనని ఒప్పుకుంటారా? తనకు తెలీదు.. అది ఫేక్ లెటర్ అంటూ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తారా? అన్నతో, డాడీతో ఉన్న గొడవలు బయటపెడతారా? ఇలా కవిత రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది తెలంగాణ.

Also Read : కవిత మరో షర్మిల..?

కాంగ్రెస్ అటాక్

మరోవైపు, కవిత లేఖ ఎపిసోడ్‌ను ఓ డ్రామాగా అభివర్ణించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. KTR హరీష్‌రావు ఇంటికి వెళ్లి లేఖ తయారు చేసి.. కవిత పేరుతో విడుదల చేశారని ఆరోపించారు. లేఖతో BJP, BRS బంధం బయటపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమన్నారు. వరంగల్‌ సభతో BRS పని అయిపోయిందని తేలిపోవడం వల్లే ఈ డ్రామాలు ఆడుతున్నారని, జాకీలు పెట్టి లేపినా BRS లేచే పరిస్థితి లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి.

దోస్తీనా? కుస్తీనా?

కవిత పేల్చిన బాంబులపై కేటీఆర్ స్పందించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీతో డిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీపై తాము చేసిన అరోపణలకి కవిత వ్యాఖ్యలతో నిజమని తేలిందన్నారు. ఇటు ఎంపీ చామల, ఆదిశ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌ కూడా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్‌లో లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయనడానికి ఈ లేఖే నిదర్శనమని చెబుతున్నారు.

నాలుగు స్తంభాలాట..

కవిత లేఖపై బీజేపీ నేతలు సైతం స్పందించారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న నాలుగు స్తంభాల ఆటలో కవిత బలైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. కేటీఆర్ అహంకారానికి కవిత అసహనానికి గురైందన్నారాయన.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×