Onion Juice For Hair Growth: మీరు కూడా జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతూ, సహజమైన,ప్రభావవంతమైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే.. ఉల్లిపాయ రసం ఒక గొప్ప ఎంపిక. ఇది మీ జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, ఫ్లేవనాయిడ్లు జుట్టును కుదుళ్ల నుండి పోషణ అందిస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలకు దారితీయడమే కాకుండా బట్టతల సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఉపయోగించడానికి రెండు ఉత్తమ మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉల్లిపాయలో చాలా సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.
ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా తలకు పోషణ అందిస్తుంది.
దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి కొత్త జీవం పోస్తుంది.
జుట్టు రాలడం వంటి సమస్యను నివారిస్తుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఇది చుండ్రు , ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షిస్తుంది. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలి ?
1. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె మిశ్రమం:
ఈ హోం రెమెడీ కోసం 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను బాగా కలపండి. దీని తరువాత.. ఈ మిశ్రమాన్ని మీ చేతి వేళ్లతో తేలికగా మసాజ్ చేయండి. దాదాపు 30 నుండి 45 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో వాష్ చేయండి. కొబ్బరి నూనె జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ఉల్లిపాయ రసం కుదుళ్లను బలపరుస్తుంది.
Also Read: ఇంట్లోనే పార్లర్ లాంటి మెరుపు కావాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
2. ఉల్లిపాయ రసం, కలబంద జెల్:
ఈ హోం రెమెడీ కోసం 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, 1 టేబుల్ స్పూన్ తాజా కలబంద జెల్‌ను బాగా కలపండి. ఇప్పుడు దానిని తలకు పట్టించి 1 గంట పాటు అలాగే ఉంచండి. దీని తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయండి. కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు తలకు ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాకుండా దురద వంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తాయి.
ముఖ్యమైన చిట్కాలు:
1. ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసే ముందు.. అలెర్జీలను నివారించడానికి ప్యాచ్ టెస్ట్ చేయండి.
2. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.