Hair Mask: పొడవాటి, ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరి కల. కానీ మారుతున్న వాతావరణంతో నాటు కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం ప్రతి ఒక్కరి జుట్టును బలహీనంగా చేస్తున్నాయి. అంతే కాకుండా రాలడానికి కూడా కారణం అవుతున్నాయి. దీంతో చాలా మంది జుట్టు రాలే సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇలాంటి సమయంలోనే మీరు ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి మీ జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా మీ జుట్టును బలంగా కూడా మారుస్తాయి. మరి జుట్టు రాలకుండా, బలంగా మారేందుకు ఎలాంటి హెయిర్ మాస్కులను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్:
జుట్టుకు పోషణ అందించడంలో కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కొబ్బరి నూనె కూడా జుట్టు చాలా మేలు చేస్తుంది. కలబంద, కొబ్బరి నూనెలతో హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ఒక గిన్నెలో కలబంద జెల్ , కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత జుట్టు మూలాల నుండి చివరల వరకు బాగా అప్లై చేయండి. దీన్ని అప్లై చేసిన తర్వాత జుట్టుపై 30 నుండి 40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీ జుట్టు మృదువుగా బలంగా మారుతుంది. మీ జుట్టు నిర్జీవంగా ఉన్నట్లయితే మీరు ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుడ్డు, పెరుగు మాస్క్:
ఈ మాస్క్ తయారు చేయడానికి ఒక గిన్నెలో గుడ్డు తీసుకొని బాగా గిలక్కొట్టండి. గుడ్లు దానికి పెరుగు , కొద్దిగా ఆలివ్ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. ఈ మాస్క్‌ను జుట్టు మీద కనీసం 30 నుండి 40 నిమిషాలు అలాగే ఉంచి ఆపై షాంపూతో కడగాలి. గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. పెరుగు జుట్టును మృదువుగా చేయడంలో సహాయ పడుతుంది. దీనిని వాడటం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
Also Read: అరటి తొక్కను ఇలా వాడితే.. గ్లోయింగ్ స్కిన్ పక్కా !
అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్:
అరటిపండు, తేనె మాస్క్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అరటిపండులో ఉండే విటమిన్లు జుట్టుకు పోషణను అందిస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును మృదువుగా, బలంగా మార్చడంలో సహాయపడతాయి. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1 పండిన అరటి పండును బాగా మెత్తగా చేయాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఆలివ్ నూనె వేసి పేస్ట్ తయారు చేయండి. ఈ హెయిర్ మాస్క్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఒత్తుగా తయారవుతుంది.