Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్ భవనాలను త్వరలో కూల్చి వేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్ ను కూల్చి వేసి కొత్త స్టేషన్ ను నిర్మించనున్నారు. రూ.309 కోట్ల వ్యయంతో అప్‌గ్రేడ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. భాగ్య నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను అధికారులు ఇప్పటికే నేలమట్టం చేశారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు రెండు రోజుల క్రితం కూల్చివేశారు. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో నాంపల్లిలోని చారిత్రాత్మకమైన హైదరాబాద్ దక్కన్ స్టేషన్ ను కూడా త్వరలో మరమ్మతుల చేపట్టనున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద నాంపల్లి రైల్వే స్టేషన్ ఎంపికైంది. దాదాపు రూ.309 కోట్ల వ్యయంతో అప్ గ్రేడ్ పనులు ప్రారంభించనున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ భవనంపై ఓ రైల్వే సీనియర్ అధికారి మాట్లాడారు. స్టేషన్ ప్రధాన భవనం అధ్వాన్నంగా ఉందన్నారు. పైన స్లాబ్ నుంచి పెచ్చులు కింద ఊడి పడుతున్నాయని తెలిపారు. ‘దీంతో రైల్వే సిబ్బంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ కు ప్రతి రోజు దాదాపు 40 వేల మంది వరకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. హైదరాబాద్ స్టేషన్ మరమ్మతులు పనులు త్వరగ చేపట్టి.. ప్రయాణికులు సౌకర్యవంతంగా స్టేషన్ కు వచ్చేలా చూడాలి’ అని అధికారి తెలిపారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ ను 1907లో ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిర్మించారు. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ ను కూల్చి వేయాలనే నిర్ణయం కొందరిని నిరూత్సాహపరుస్తుంది. ప్రసిద్ధి చెందిన నాంపల్లి దక్కన్ రైల్వే స్టేషన్ వారి జ్ఞాపకాలను బాధకు గురిచేస్తుంది.
Also Read: Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. మంచి వేతనం.. DON’T MISS
2022 జూలైలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ స్టేషన్ నుంచి రైళ్లలో ప్రయాణించిన రోజులను ప్రజలు గుర్తు చేసుకున్నారు.