Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా అడుగుపెట్టారు నాగచైతన్య (Naga Chaitanya). గత కొన్ని సంవత్సరాలుగా వరస సినిమాలు చేస్తున్నారు కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇక ఇటీవల వచ్చిన ‘తండేల్ ‘ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ చిత్ర బృందం మాత్రం భారీ సక్సెస్ అయిందని సక్సెస్ మీట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇకపోతే నాగచైతన్య సినిమా జీవితం కంటే వ్యక్తిగత కారణాల వల్లే పలుమార్లు వార్తల్లో నిలిచారు. అసలు విషయంలోకెళితే.. ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన కోలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) తో ప్రేమలో పడ్డారు నాగచైతన్య.. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమాయణం కొనసాగించిన వీరు 2017లో పెద్దలను ఒప్పించి అటు హిందూ సంప్రదాయం ప్రకారం, ఇటు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు.
నాగచైతన్య వ్యక్తిగత జీవితం..
వివాహం జరిగిన తర్వాత కూడా పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇండస్ట్రీలో జంట అంటే ఇలా ఉండాలి అంటూ క్యూట్ కపుల్ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా సమంత – నాగచైతన్య 2020 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇక మీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు తెలియదు కానీ చాలామంది సమంత పై విమర్శలు గుప్పించారు. ఇక ఆ సంగతి అటు ఉంచితే .. సమంత నుంచి విడాకులు తీసుకున్న రెండేళ్లకే శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) తో ప్రేమలో పడ్డారు. ముఖ్యంగా పలు వెకేషన్ లకు , ట్రిప్ లకు వెళుతూ తమ బంధాన్ని రహస్యంగా దాచే ప్రయత్నం చేశారు. కానీ మీడియా మాత్రం వీరిని వదలలేదు. ఇక ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట , అదే ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకొని మీడియా అనుమానాలను నిజం చేసింది. ఇక దీంతో నాగచైతన్య.. శోభిత కారణంగానే సమంతకు విడాకులు ఇచ్చారు అంటూ మళ్లీ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేశారు.
చైతూ, శోభితని ఇష్టపడడం.. సుమాకి ముందే తెలుసా..?
ఇక ఇదంతా ఇలా ఉండగా.. నాగచైతన్య తన మేనమామ వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుమా కనకాల (Suma Kanakala ) మాట్లాడుతూ..” ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు డైరెక్టర్ ఎవరు?” అని ప్రశ్నిస్తూనే..” మీకు ఆ సినిమా అంటే ఇష్టం అంట కదా..” అంటూ నాగచైతన్యను ప్రశ్నించింది. “ఇక వెంకటేష్ గారు నటించిన ఇన్ని చిత్రాలు ఉండగా.. మీకు ఆ సినిమానే ఎందుకు నచ్చింది..?” అంటూ మరో ప్రశ్న వేయగా.. మధ్యలో కలగజేసుకున్న వెంకటేష్ కూడా “అలా అడుగు” అంటూ సుమాను మరింత ఎంకరేజ్ చేశారు. దీనికి నాగచైతన్య సిగ్గుపడుతూ.. నవ్వుతూ..” ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పకూడదండి” అంటూ మాట దాటేశాడు. పెళ్లవ్వకముందు అయితే ఈ విషయాలు చెప్పే వాడివి కదా అని సుమా అంటే.. అవును నిజమే.. అంటూ నాగచైతన్య చెప్పడంతో సుమాకి అప్పుడే శోభిత గురించి అసలు విషయం తెలుసా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది గురూజీ సైలెంట్ గా ఉంటాడు కానీ మామూలోడు కాదు.. అందుకే సమంతను పెళ్లి చేసుకుని శోభితతో ప్రేమాయణం నడిపించాడు. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లాడాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వెంకి మామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఈ వీడియో క్లిప్ ని ఇప్పుడు కొంతమంది నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.