Cracked Heels: చాలా మందికి సీజన్ ఏదైనా చేతులు, కాళ్ళు, ముఖంతో పాటు, మడమలు కూడా పగుళ్లు రావడం ప్రారంభిస్తాయి. మడమలు పగిలిపోవడం అనేది ఒక సాధారణ సమస్య. ఇది పొడి చర్మం, పోషకాహార లోపం, నీరు లేకపోవడం లేదా ఎక్కువసేపు నిలబడటం వంటి అలవాట్ల వల్ల వస్తుంది.
ఒక వేళ ఇది తీవ్రమైతే ఇన్ఫెక్షన్ లేదా చర్మ సమస్యకు కారణం అవుతుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. కాళ్ల యొక్క పగుళ్లను తగ్గించడంలో హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.
గోరు వెచ్చని నీరు:
పగిలిన మడమల నుండి ఉపశమనం పొందడానికి మీరు మీ మడమలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం మంచిది. దీని కోసం, ఒక టబ్‌లో గోరు వెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు , కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఇప్పుడు మీ పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టండి. దీని తరువాత, ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్క్రబ్బర్ తో మడమలను తేలికగా రుద్దండి. ఇలా చేయడం వల్ల మడమల మీద ఉన్న మృత చర్మం కూడా తొలగిపోతుంది.
కొబ్బరి నూనె, నెయ్యి వాడకం :
కాస్త కొబ్బరి నూనె తీసుకుని రాత్రి పడుకునే ముందు మీ మడమలకు అప్లై చేయండి. నెయ్యి లేదా ఆలివ్ నూనె వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మీరు వాడాలని అనుకున్న ఆయిల్‌ను బాగా మసాజ్ చేసి, ఆపై సాక్స్ ధరించండి. ఇలా 15 రోజులు చేయడం వల్ల మీ మడమలు మృదువుగా మారుతాయి. కొబ్బరి నూనెలో ఉండే గుణాలు చర్మాన్ని కోమలంగా తయారు చేస్తాయి. అంతే కాకుండా తెల్లగా మెరిసేలా కూడా మారుస్తాయి.
తేనెను వాడండి:
తేనెలో ఉండే అంశాలు చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో 2-3 టీస్పూన్ల తేనె కలపండి. ఇప్పుడు మీ పాదాలను అందులో 15 నిమిషాలు నానబెట్టండి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా మృదువుగా మారుస్తుంది.
అలోవెరా జెల్:
మీ దగ్గర తాజా అలోవెరా జెల్ ఉంటే.. పగిలిన మడమల కోసం ఉపయోగించండి. ప్రతిరోజూ పడుకునే ముందు పగిలిన మడమలపై తాజా కలబంద జెల్ రాయండి. ఇది చర్మాన్ని తేమగా చేసి పోషణ నిస్తుంది. కాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు అలోవెరా జెల్ వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
Also Read: ఈ నేచురల్ హెయిర్ కలర్‌తో తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !
గ్లిజరిన్ , రోజ్ వాటర్:
గ్లిజరిన్‌లో ఉండే మూలకాలు మడమలకు తేమను అందిస్తాయి. అంతే కాకుండా మడమల పగుళ్ల సమస్యలను కూడా తగ్గిస్తాయి. కాస్త గ్లిజరిన్ తీసుకని దానికి తగినంత రోజ్ వాటర్ కలపండి. పగిలిన మడమల మీద ఈ మిశ్రమాన్ని కలిపి రాత్రంతా అలాగే ఉంచండి. ఇది తక్కువ సమయంలోనే పగిలిన మడమలకు ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా కాళ్లను కూడా మృదువుగా మారుస్తుంది.