Natural Hair Colour: తెల్ల జుట్టు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడటానికి బయట మార్కెట్ లో దొరికే కెమికల్స్ తో తయారు హెయిర్ కలర్స్ వాడుతుంటారు. మరికొంతమంది షాంపూలను కూడా ట్రై చేస్తుంటారు. కానీ హెయిర్ కలర్స్ తయారీలో వాడే రసాయనాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. అంతే కాకుండా క్యాన్సర్‌కు కారణం అవుతాయి. జుట్టుకు సహజ రంగు సహజ పదార్థాలతో తయారు చేసిన హెయిర్ డైని ఉపయోగించడం సురక్షితమైన, ప్రభావ వంతమైన మార్గం.
సహజ పద్ధతులకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ సహజ రంగులు జుట్టుకు అందమైన రంగును అందించడమే కాకుండా, జుట్టుకు పోషణను కూడా అందిస్తాయి.
హెయిర్ కలర్ తయారీ:
కావాల్సినవి:
నేచురల్ హెన్నా పొడి – ఏడు నుండి ఎనిమిది టీస్పూన్లు
నీరు- తగినంత
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
తాజాదనం కోసం పెరుగు – చిన్న కప్పు
తయారీ విధానం:
ఒక పాత్రలో హెన్నా పౌడర్ తీసుకుని దానికి సరిపడా నీళ్లు పోసి పేస్ట్ తయారు చేసుకోండి.మీకు కావాలంటే దీనికి నిమ్మరసం కూడా కలిపుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ముదురు నలుపు రంగులోకి మారుతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించి 2-3 గంటలు అలాగే ఉంచండి. తర్వాత తలస్నానం చేయండి. ఈ హెయిర్ కలర్ మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తగిన పోషణను కూడా అందిస్తుంది.
కాఫీతో హెయిర్ కలర్:
కావలసినవి:
కాఫీ పౌడర్-2-3 టీస్పూన్లు
నీరు- 1 చిన్న కప్పు
షాంపూ-1-2 టీస్పూన్లు
తయారీ విధానం:
ముందుగా కాఫీ పొడిని నీటిలో వేసి మరిగించాలి. అది చల్లబడిన తర్వాత దానికి షాంపూ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టుకు మంచి రంగును ఇస్తుంది. తరచుగా దీనిని వాడటం వల్ల మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా పూర్తిగా తగ్గుతుంది. కాఫీ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా మేలు చేస్తుంది.
టీతోహెయిర్ డై:
కావలసినవి:
హెన్నా- సరిపడా
బ్లాక్ టీ ఆకులు-2-3 టీస్పూన్లు
నీరు-1 చిన్న కప్పు
Also Read: పళ్లు పసుపు రంగులోకి మారాయా ? ఈ టిప్స్ మీ కోసమే !
తయారీ విధానం:
ముందుగా టీ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. తర్వాత అందులో హెన్నా వేసి చల్లబరిచి జుట్టుకు అప్లై చేయండి. దీన్ని జుట్టులో 30-45 నిమిషాలు ఉంచి తర్వాత తల స్నానం చేయండి. ఇది జుట్టుకు లేత గోధుమ రంగును ఇస్తుంది. అంతే కాకుండా జుట్టు మెరుపును కూడా పెంచుతుంది. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తరచుగా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ హెయిర్ డైలను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.