BigTV English

Ritu Varma: ఆ సినిమా అందరికీ నచ్చదు.. సొంత మూవీపై రీతూ వర్మ షాకింగ్ స్టేట్‌మెంట్

Ritu Varma: ఆ సినిమా అందరికీ నచ్చదు.. సొంత మూవీపై రీతూ వర్మ షాకింగ్ స్టేట్‌మెంట్

Ritu Varma: ఒక సినిమా కథను నమ్మి దాని మీద సమయాన్ని కేటాయించే హీరోహీరోయిన్లు అది హిట్ అవ్వాలనే కోరుకుంటారు. కొన్నిసార్లు అది హిట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా అందులో తమ పాత్ర బాగుంటే చాలు అని అనుకుంటారు. కానీ ఎంతైనా తాము నటించే సినిమా హిట్ అవ్వాలనే అందరికీ ఉంటుంది. అలాంటిది రీతూ వర్మ మాత్రం ఒక సినిమా ఫ్లాప్ అవుతుందనే తెలిసే అందులో యాక్ట్ చేశానంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రీతూ.. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. తాజాగా తన సొంత చిత్రంపై తను ఇచ్చిన స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


డేరింగ్ కామెంట్స్

షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది రీతూ వర్మ. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే అయినా తను చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఇంపాక్ట్ ఉన్న కథలు, పాత్రల్లో నటించడానికే రీతూ ఎక్కువగా ఇష్టపడుతోంది. దానికోసం తన కెరీర్‌లో గ్యాప్ వచ్చినా పెద్దగా పట్టించుకోదు. అలా ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మజాకా’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది రీతూ వర్మ. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తను ఇంతకు ముందు నటించిన సినిమాపై ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. అది విని సొంత సినిమా గురించి ఇంత డేరింగ్‌గా మాట్లాడడం గ్రేట్ అని తన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


చాలా తృప్తినిచ్చింది

‘మజాకా’ కంటే ముందు శ్రీవిష్ణుతో కలిసి ‘స్వాగ్’ (Swag) అనే సినిమాలో నటించింది రీతూ వర్మ (Ritu Varma). ఈ మూవీ మంచి సోషల్ మెసేజ్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కానీ కమర్షియల్‌గా ఊహించినంత రేంజ్‌లో విజయం సాధించలేదు. దీంతో తాజాగా ‘స్వాగ్’ రిజల్ట్‌పై స్పందించింది రీతూ వర్మ. ‘‘స్వాగ్ అనేది అందరికీ నచ్చే సినిమా కాదని మాకు ముందు నుండే తెలుసు. చాలామందికి ఆ కథలోని లోతు అర్థం కాలేదు. అయినా పర్వాలేదు. ఒక యాక్టర్‌గా నాకు చాలా తృప్తినిచ్చే ఎక్స్‌పీరియన్స్ అందించింది స్వాగ్’’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ వర్మ. ఒక సినిమా అందరికీ నచ్చకపోయినా కూడా ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం చాలా గ్రేట్ అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నడిరోడ్డుపై హీరోయిన్‌కు ముద్దు.. ఇలా ఉన్నారేంట్రా మీరు..

పర్ఫార్మెన్స్ అదుర్స్

హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమానే ‘స్వాగ్’. అందులో శ్రీ విష్ణుకు జోడీగా రీతూ వర్మతో పాటు దక్ష నగార్కర్ కూడా నటించింది. ముఖ్యంగా ఇందులో రీతూ పాత్ర చాలామంది అమ్మాయిలకు నచ్చింది. ఒక ఫెమినిస్ట్‌గా, ధైర్యంగా అన్నింటిని ఎదిరించే అమ్మాయిగా తను కనిపించింది. అలా ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అలాంటి సోషల్ మెసేజ్ సినిమా తర్వాత ‘మజాకా’ (Mazaka) లాంటి కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించనుంది రీతూ వర్మ. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×