BigTV English

Raw Papaya Benefits: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్

Raw Papaya Benefits: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. ఈ సమస్యలకు చెక్

Raw Papaya Benefits: బొప్పాయి కాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వారికి ఇది దివ్యౌషధం. సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో పచ్చి బొప్పాయి కూడా ఒకటి.  బొప్పాయికాయలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఎన్నో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సాధారణంగా అందరూ బొప్పాయిని పండిన తర్వాత మాత్రమే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బొప్పాయి కాయ దశలో ఉన్నప్పుడు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


జీర్ణక్రియ మెరుగుదల:
పచ్చి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్‌లు జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా గ్యాస్ట్రిక్, ఆమ్ల స్రావాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఎంజైమ్స్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా అజీర్ణం లాంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

2010 లో జర్నల్ ఆఫ్ ఎండో ఫార్మాకాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం రోజుకు రెండు సార్లు 50 గ్రాముల పచ్చి బొప్పాయి తిన్నవారి కడుపు సంబంధిత సమస్యలు, వాంతులు, అజీర్ణం వంటి లక్షణాలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ ది వెస్టిండీస్‌కు చెందిన పోషకాహార నిపుణులు పాల్గొన్నారు. పచ్చి బొప్పాయిలోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయని ఆయన వెల్లడించారు.


కామెర్లు:
కామెర్ల నివారణకు పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి మూడు గంటలకొకసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఫోటో లైట్ ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. దీని నుంచి మందులు కూడా తయారు చేస్తారు. కామెర్ల చికిత్సలో కూడా ఇవి సహాయపడతాయి.

మలేరియా:
పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ, సి మలేరియా, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి, అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కూడా మలేరియా, డెంగ్యూ రోగుల్లో ప్లేట్ లెట్స్ పెంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేదిక్ ఔషధంగా కూడా ఇది పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో మంట తగ్గిస్తుంది:
పచ్చి బొప్పాయి శరీరంలోని కడుపులో మంటను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, తిమ్మిరితో సహా శరీరంలో అనేక రకాల నొప్పులు, మంటలను తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు ప్రభావవంతంగా నొప్పులను తగ్గించడంలో పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్ ఇదే.. ఓ సారి ట్రై చేసి చూడండి మరి

పచ్చి బొప్పాయిలో రబ్బరు పాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది కొందరికి పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో హర్మోన్లను ప్రేరేపిస్తుంది. అందుకే గర్భిణులు దీన్ని తినకపోవడమే మంచిది. పచ్చి బొప్పాయిని తినే వారు ముందుగా డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. ఆ తర్వాతే బొప్పాయి కాయను తినాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×