Tan Removal Tips: వాతావరణంలో మార్పు, సూర్యకాంతి కారణంగా ముఖంపై ట్యాన్ పెరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల, మీ సున్నితమైన చర్మం ట్యాన్ అవ్వడం ప్రారంభమవుతుంది. స్కిన్ ట్యానింగ్ వల్ల చర్మం రంగు కూడా మారుతుంది. అలాగే మీ చర్మం పొడిగా, నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి ట్యానింగ్ సమస్యను నివారించడానికి మీరు కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిమ్మకాయ, తేనె:
ఆస్కార్బిక్ ఆమ్లం కలిగిన నిమ్మకాయను ఉపయోగించడం వల్ల ట్యానింగ్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం, ఒక గిన్నెలో ఒక పెద్ద చెంచా తేనె తీసుకుని, అందులో 5-6 చుక్కల నిమ్మరసం కలపండి. దీన్ని మీ ముఖం, మెడ అంతటా బాగా కలిపి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నల్లబడిన చర్మం కూడా తక్కువ సమయంలోనే తెల్లగా మారుతుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం నిమ్మకాయ , తేనెతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ వాడటం అలవాటు చేసుకోండి.
2. దోసకాయ రసం:
ట్యానింగ్ ను వదిలించుకోవడంలో దోసకాయ రసం కూడా చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. దీనికోసం మీరు 2 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం తీసుకోండి. అందులో దూదిని నానబెట్టి ముఖంపై రోజుకు 3-4 సార్లు అప్లై చేయండి. ఇది మీకు చాలా ప్రయోజనాలను లభిస్తుంది. అంతే కాకుండా ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
3. పెరుగు:
వేసవిలో పెరుగు తినడం వల్ల చల్లదనం లభించడమే కాకుండా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పెరుగు యొక్క ప్రయోజనాలు సన్ టాన్ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ట్యానింగ్ తొలగించడానికి మీరు ముఖానికి రోజుకు కనీసం రెండుసార్లు పెరుగును అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే తేడాను చూస్తారు.
Also Read: మచ్చ లేని, తెల్లటి ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
4. ముల్తాని మిట్టి , రోజ్ వాటర్:
వేసవిలో మీ చర్మానికి ముల్తానీ మిట్టి కంటే మెరుగైనది ఏదీ లేదు. ఇది మీ చర్మాన్ని తేమగా మార్చడమే కాకుండా, టానింగ్‌ను కూడా తొలగించగలదు. ఇందుకోసం అవసరానికి అనుగుణంగా 2 టీ స్పూన్ల ముల్తాని మిట్టి పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు దానిని చర్మంపై అప్లై చేసి దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. ఆపై మెత్తని టవల్‌తో తుడవండి.
5. రోజ్ వాటర్:
చర్మ సౌందర్యానికి రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్ లో ఉండే గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా రోజ్ వాటర్ ను కొన్ని పదార్థాలతో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి. ట్యాన్ ను తొలగించడంలో కూడా రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.