BigTV English

Papaya For Face Glow: మచ్చ లేని, తెల్లటి ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Papaya For Face Glow: మచ్చ లేని, తెల్లటి ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Papaya For Face Glow: బొప్పాయి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ముఖంపై ఉండే మచ్చలను కూడా పూర్తిగా తొలగించడంలో దోహదం చేస్తాయి.


బొప్పాయిలో కొన్ని రకాల పదార్థాలు కలిపి ముఖానికి వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి పేస్ట్‌లో పాలను కలిపి ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకుని వాడటం వల్ల అనేక లాభాలు  ఉంటాయి. ఇది చర్మానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. బొప్పాయి పేస్ట్, పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ తక్షణ గ్లో అందిస్తుంది.


బొప్పాయి, పాలలో లభించే పోషకాలు:
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అనేక ఖనిజాలు ఉంటాయి. పాలలో ఉండే లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇది వృద్ధాప్యాన్ని తగ్గించడంలో, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతి వంతంగా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.

పాలు , బొప్పాయి పేస్ట్‌తో ఫేస్ ప్యాక్ :

నల్లటి మచ్చలు: పాలు, బొప్పాయి పేస్ట్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బొప్పాయి, పాలు కలిపిన మిశ్రమాన్ని రాసుకుంటే మచ్చలు తొలగిపోతాయి.

మెరిసే చర్మం:
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు , బయో ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని శుభ్రపరచడానికి పనిచేస్తాయి. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల ముడతల సమస్య తగ్గుతుంది. దీనివల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. పాలు చర్మం యొక్క తేమను నిలుపుకుంటాయి.

మొటిమలు తగ్గుతాయ్:
పాలు, బొప్పాయి పేస్ట్‌ల మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఇది ముఖంపై ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read: 30 రోజులు ఈ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు!

చర్మంపై తేమ:
చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే బొప్పాయి , పాలతో తయారు చేసిన ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల చర్మానికి హైడ్రేషన్ లభిస్తుంది. చర్మం మెరుస్తుంది.

బొప్పాయి, పాలతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, 6-7 మెత్తని బొప్పాయి ముక్కలను తీసుకొని బాగా గుజ్జు చేయండి. ఇప్పుడు 2-3 చెంచాల పాలు వేసి బాగా కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. మీరు ఫేస్ ప్యాక్ ను మరింత ప్రభావవంతంగా మార్చాలనుకుంటే దానికి 1 చెంచా తేనె వేస బాగా కలపండి. ఇప్పుడు దీనికి ముందు ముఖాన్ని తేలికగా మసాజ్ చేసి, ఆపైఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. సమయం ముగిసిన తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో బాగా కడగాలి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×