Cumin Water: జీలకర్ర ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడతాయి. జీలకర్ర నీరు త్రాగితే కూడా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలా మంది ఉదయం పూట కడుపు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు జీలకర్ర నీటిని తాగడం వల్ల మీకు మేలు కలుగుతుంది.
పొట్టను శుభ్రం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అనేక రకాల జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా ప్రభావవంతగా పని చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జీలకర్ర నీరు ప్రతి రోజు త్రాగితే ఎన్ని లాభాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీటిని ఎలా తయారీ విధానం:
జీలకర్ర నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక చెంచా జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్రలేవగానే ఈ నీటిని మరిగించి, కాస్త చల్లారాక ఖాళీ కడుపుతో తాగాలి. ఈ నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
జీలకర్రలో జీర్ణ శక్తిని బలపరిచే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది మీ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది:
మలబద్ధకం సమస్యకు జీలకర్ర సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఈ నీరు ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది ఉదయం కడుపుని ఖాళీ చేయడం సులభం చేస్తుంది. రోజు జీలకర్ర నీటిని తాగడం ద్వారా, ప్రేగు కదలికలు సక్రమంగా జరుగుతాయి. అంతే కాకుండా మీరు మలబద్ధకం సమస్య నుండి విముక్తి పొందుతారు.
అసిడిటీలో మేలు చేస్తుంది:
అసిడిటీ వల్ల పొట్టలో మంట ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రం చేయకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. జీలకర్రలో ఉండే మూలకాలు పొట్టలోని అసిడిటీని బ్యాలెన్స్ చేసి పొట్టకు చల్లదనాన్ని అందిస్తాయి. ఒక వేళ మీరు అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, జీలకర్ర నీరు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదా.. ఇలా చేస్తే రిజల్ట్ పక్కా
కడుపులో గ్యాస్, ఉబ్బరం నుండి ఉపశమనం:
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల తరచుగా వచ్చే గ్యాస్ ,కడుపు ఉబ్బరం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్ర నీరు కూడా ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడే ప్రక్రియను నియంత్రించడంతో పాటు, కడుపు ఉబ్బరం నుండి మీకు ఉపశమనం కలిగించేలా చేస్తుంది.
జీలకర్ర నీరు ఒక సాధారణ, ప్రభావవంతమైన హోం రెమెడీ, ఇది పొట్టను శుభ్రం చేయడంలో చాలా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.