BigTV English

IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్‌ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్‌ కు పండగే?

IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్‌ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్‌ కు పండగే?

 


IPL 2025: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ( Indian Premier League 2025) టోర్నమెంట్‌ కు కౌంటర్‌ షురూ అయింది. అక్టోబర్‌ 31వ తేదీ లోపే… ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 కు సంబంధించిన రిటెన్షన్‌ లిస్ట్‌ ను ప్రకటించాలి. ఈ తరుణంలోనే… చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) అభిమానులకు శుభవార్త అందజేశాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ 2025 సీజన్ లో మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) తన ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. అంతేకాకుండా వచ్చే మూడు సంవత్సరాలు ఐపీఎల్ మ్యాచులు ఆడుతానని, ఆటను ఆస్వాదిస్తానని శుభవార్త తెలియజేశాడు.

MS Dhoni hints at continue playing IPL after 2025 season

Also Read: MS Dhoni: ఐపీఎల్‌ 2025 నుంచి ఔట్‌..ఝార్ఖండ్‌ ఎన్నికల బరిలోకి ధోనీ ?


ఐపీఎల్ కోసం తాను ఫిట్నెస్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలియజేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ధోని ఆడడంపై అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ధోని ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని, వికెట్ కీపింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారంటూ అనేక రకాల కథనాలు వచ్చాయి. మరొకవైపు సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ధోని నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం రాలేదని చెప్పడంతో ధోని ఐపిఎల్ సీజన్ కు దూరం అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ధోని ( MS Dhoni) ఈ వార్తలకు చెక్ పెట్టాడు.

Also Read: IND VS NZ: రెండో టెస్ట్ లో టీమిండియా ఓటమి..69 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన న్యూజిలాండ్!

ఇదిలా ఉండగా…. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) జార్ఖండ్ లో ( Jharkhand) అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెస్ ధోని ఫోటోలు వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతిని ఇచ్చిందని ఝార్ఖండ్ కు చెందిన ఎన్నికల అధికారి కే. రవికుమార్ తెలియజేశాడు. ధోని ఫోటోను వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ కు మహేంద్ర సింగ్ ధోని అంగీకారాన్ని తెలియజేశాడు.

దీంతో వివరాల కోసం మేము ధోనితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు. మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) ఓటర్ల సమీకరణకు తప్పకుండా తనవంతు కృషి చేస్తారని రవికుమార్ ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమం కింద ఓటర్లలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మహేంద్రసింగ్ ధోని తన వంతు పాత్రను పోషించనున్నాడు. అంతేకాకుండా అక్కడ జరిగే ఎలక్షన్లలో పోలింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించనున్నాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ ( Indian Premier League 2025) కోసం పతిరణ, జడేజా, రుతు రాజ్‌, లాంటి ప్లేయర్లను రిటైన్‌ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయం తీసుకుందట. మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) ఐంపాక్ట్‌ ప్లేయర్‌ గా వస్తాయి.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×