E-Paper
Advertisement

ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!

ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!
Advertisement

Kids Healthy Breakfast: ఉదయాన్నే పిల్లలు నిద్రలేచాక వారికి ఇచ్చే అల్పాహారం రోజంతటికీ అవసరమైన శక్తిని ఇస్తుంది. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఉదయం సరైన ఆహారం అందించకపోతే రోజంతా నీరసంగా, ఏకాగ్రత లేకుండా ఉంటారు. అందుకే జంక్ ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్ పక్కనబెట్టి ఇంట్లోనే బలాన్నిచ్చే అల్పాహారం అందించడం ఎంతో ముఖ్యం. పిల్లలకు నచ్చేలా, హెల్తీగా ఉండే ఐదు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లు ఇప్పుడు చూద్దాం.

పెసరట్టు

పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇది సులభంగా అరుగుతుంది కూడా. రాత్రి నానబెట్టిన పెసరపప్పును రుబ్బి, అందులో సన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిపాయలు, తురిమిన బీట్‌రూట్ కలిపి వేడివేడిగా అట్టులా వేసి ఇవ్వొచ్చు. ఇది పిల్లల కండరాల పెరుగుదలకు, బలానికి చాలా మంచిది.

కూరగాయల ఉప్మా

Advertisement

రవ్వతో చేసే ఉప్మా ఎంతో తేలికైన ఆహారం. దీన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి బఠానీలు, బీన్స్, క్యారెట్ వంటి కూరగాయలు ఎక్కువగా వేసి వండాలి. రవ్వ వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తే.. కూరగాయల ద్వారా విటమిన్లు, పీచు పదార్థం అందుతాయి.

Also Read: మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!

పోషకాల అటుకులు

Advertisement

అటుకుల ఉప్మా లేదా పోహా పిల్లలకు జీర్ణం కావడం చాలా తేలిక. ఉల్లిపాయలు, క్యారెట్, బఠానీలతో కలిపి అటుకులను తిరగమాత వేసి నిమ్మరసం పిండి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూలుకు వెళ్లే హడావుడిలో తక్కువ సమయంలో అయిపోయే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఇది.

శనగపిండి చిల్లా

శనగపిండితో వేసే అట్లు లేదా పూడ్లాలు ప్రోటీన్లకు మంచి నిలయం. శనగపిండిలో కాస్త పాలకూర, టమాట, క్యారెట్ తురుము కలిపి దోశలా కాల్చి ఇస్తే రంగురంగులుగా ఉండి పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారు. శాకాహార ప్రోటీన్ అందించడానికి ఇది అద్భుతమైన మార్గం.

పెరుగు పండ్ల మిశ్రమం

సమయం లేనప్పుడు లేదా వంట చేయలేని పరిస్థితుల్లో పెరుగు, పండ్ల మిశ్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది. తాజా పెరుగులో ఆపిల్, అరటి, పపాయ ముక్కలు కలిపి ఇస్తే సరిపోతుంది. పెరుగు వల్ల క్యాల్షియం లభిస్తే.. పండ్ల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి సహజమైన, బలమైన ఆహారం అలవాటు చేస్తే వారు ఆరోగ్యంగా, చురుగ్గా పెరుగుతారు. రోజుకో రకం చేసి పెడితే బోర్ కొట్టకుండా తింటారు.

Also Read: ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

Tags

Related News

ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!

మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!

చెత్తకుండీలు లేకుండానే దేశమంతా క్లీన్.. జపాన్ పరిశుభ్రత సీక్రెట్ ఇదే

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ తినకూడదు

గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఏ గిఫ్ట్ కొనాలా అని టెన్షన్ పడుతున్నారా? 5 బెస్ట్ ఐడియాస్ మీ కోసం

భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!

Big Stories

Advertisement
×