E-Paper
Advertisement

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!
Advertisement

True-Up Charges: తెలంగాణలో కరెంట్‌ బిల్లులు షాక్‌ ఇవ్వనున్నాయి. ట్రూ అప్‌ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని డిస్కంలకు ERC అనుమతినిచ్చింది. దాంతో 5వేల 435 కోట్ల బకాయిల రికవరీలో భాగంగా నవంబర్‌ నుంచి వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

ట్రూ అప్‌ చార్జ్‌..

కరెంట్‌ కొనుగోలుకైనా ఖర్చు వచ్చిన రాబడికి మధ్య తేడా వస్తే ఆ లోటును పూడ్చుకునేందుకు డిస్కంలకు వెసులుబాటు వుంటుంది. లోటు భర్తీ కోసం వినియోగదారుల నుంచి చేసే అదనపు వసూళ్లనే ట్రూ అప్‌ చార్జ్‌ అంటారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి అదనపు వ్యయం 5వేల 186 కోట్లు. ఇక 2023-24 రెవెన్యూ లోటు 2 వేల 448 కోట్లు. మొత్తంగా 7వేల 635 కోట్లకు పైగా బకాయిలకు సంబంధించి రెండు డిస్కంలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఆశ్రయించాయి.

Advertisement

Also read: అక్టోబర్‌లోగా కరువు నివేదిక సిద్ధం చేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశం!

ఉచిత విద్యుత్‌ పథకం

నార్త్‌, సౌత్‌ తెలంగాణ డిస్కంల పిటిషన్లను పరిశీలించిన TG ERC.. ఉచిత విద్యుత్‌ పథకం అమలమవుతోన్న నేపథ్యంలో వ్యవసాయానికి సంబంధించిన 2వేల 214 కోట్లను ప్రభుత్వం నుంచి తీసుకోవాలని సూచించింది. మిగిలిన 5వేల 420 కోట్లను ట్రూ అప్‌ చార్జీలుగా వసూలు చేసుకోవచ్చని డిస్కంలకు అనుమతినిచ్చింది. నవంబర్‌ నుంచి కరెంట్‌ బిల్లుల్లో యూనిట్‌కు అదనంగా 30 పైసలు.. ఆ తరువాత నెల నుంచి 50పైసల చొప్పున ట్రూ అప్‌ చార్జీలను ఫిక్స్ చేసింది.

కరెంట్‌ బిల్లుల మోత..

Advertisement

ERC ఆదేశాల ప్రకారం దక్షిణ తెలంగాణ డిస్కమ్‌ పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలల పాటు ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయాల్సి వుంటుంది. కరెంట్‌ బిల్లులో ట్రూప్‌ ఛార్జీలను వివరాలను విధిగా పేర్కోవాలని డైరెక్షన్‌ ఇచ్చింది. కరెంట్‌ వాడకాన్ని బట్టీ బిల్లు వచ్చేది. నవంబర్‌ నుంచి ట్రూప్‌ ఛార్జీలతో కరెంట్‌ బిల్లుల మోత మోగనుంది. ఐతే ఎంత వసూలు చేస్తున్నారన్నది బిల్లులో క్లియర్‌ మెన్షన్‌ చేయాలని ఆదేశించింది ఈఆర్సీ. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ఆధారంగానే ట్రూప్‌ చార్జీలను నిర్ణయించినట్టు పేర్కొంది.

Also read: బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

Tags

Related News

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!

తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

Big Stories

Advertisement
×