E-Paper
Advertisement

ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!
Advertisement

Energy Drinks Health Risks: పిల్లలు ఆటలాడి అలసిపోయినప్పుడో లేదా చదువుకునే సమయంలో కాస్త ఉత్సాహం కోసమో ఎనర్జీ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. పైగా టీవీల్లో, సోషల్ మీడియాలో స్పోర్ట్స్ స్టార్స్, పాపులర్ సెలబ్రిటీలు వీటిని ప్రమోట్ చేస్తుంటే నిజంగానే ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయేమో అని భ్రమపడుతున్నారు. కానీ ఈ రంగురంగుల డబ్బాల వెనుక దాగున్న ప్రమాదాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలేమిటీ ఎనర్జీ డ్రింక్స్?

చాలామంది ఎనర్జీ డ్రింక్స్‌ను, స్పోర్ట్స్ డ్రింక్స్‌ను ఒక్కటే అని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఆటలు ఆడినప్పుడు చెమట ద్వారా కోల్పోయే నీటిని, ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసేవి స్పోర్ట్స్ డ్రింక్స్. కానీ ఎనర్జీ డ్రింక్స్ అలా కాదు. వీటిల్లో కేవలం కెఫిన్, ఇతర ఉత్ప్రేరకాలు విపరీతంగా ఉంటాయి. ఒక టీ కప్పు కాఫీలో కంటే వీటిల్లో కెఫిన్ పరిమాణం చాలా రెట్లు ఎక్కువ. ఇది పిల్లల సన్నని శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Advertisement

Also Read: ఆఫర్ ధర కన్నా లాంచ్ ధరే తక్కువ.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ వెనుక పెద్ద స్కెచ్, కొనేముందు జాగ్రత్త!

ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలు..

అధిక మోతాదులో కెఫిన్ శరీరంలోకి చేరినప్పుడు గుండె వేగం అకస్మాత్తుగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఫిట్స్ రావడం, చివరికి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆందోళన, శారీరక నీరసం వంటి సమస్యలు పిల్లలను వేధిస్తాయి.

మిక్సింగ్ డ్రింక్స్ ఎంత ప్రమాదం?

Advertisement

రోజంతా కూల్ డ్రింక్స్ లేదా కాఫీలతో పాటు ఈ ఎనర్జీ డ్రింక్స్ కూడా కలిపి తాగడం వల్ల ప్రమాద తీవ్రత రెట్టింపవుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో కూడా ఈ మిశ్రమం గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. పూర్వపు ఆరోగ్య సమస్యలు ఏవీ లేకపోయినా.. అతిగా కెఫిన్ ఒకే రోజు శరీరంలోకి చేరడం వల్ల గుండె ఆగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఏ రూపంలోనూ కెఫిన్ ఎక్కువ కాకుండా చూడటం ముఖ్యం.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

ముందుగా ఎనర్జీ డ్రింక్స్‌కు, స్పోర్ట్స్ డ్రింక్స్‌కు మధ్య ఉన్న తేడాను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో పెద్దలు కూడా వీటిని తాగకుండా పిల్లలకు మంచి మార్గదర్శకంగా నిలవాలి. డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు పిల్లల ఆహార అలవాట్ల గురించి మాట్లాడటం మంచిది. పిల్లల ఆరోగ్యానికి ప్యాక్ చేసిన డ్రింక్స్ కంటే మంచి నీళ్లు, సహజ సిద్ధమైన పండ్ల రసాలు ఇవ్వడమే ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గం.

Also Read: ఒక్కసారి ఇలా రాయలసీమ మటన్ వేపుడు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుంటారు!

Tags

Related News

నోరూరించే బీరకాయ కొత్తిమీర చట్నీ..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

ట్రెడిషనల్ స్టైల్ కట్టే పొంగలి..ఇలా చేస్తే తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

మెట్టెలు, ముక్కుపుడక కేవలం అలంకారమేనా? ఆడవాళ్లకు వీటిని తప్పనిసరి చేయడం వెనుకున్న కారణాలివే!

ఒక్కసారి ఇలా రాయలసీమ మటన్ వేపుడు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుంటారు!

గోవా స్టైల్ కరకరలాడే రవ్వ ఫిష్ ఫ్రై రెసిపీ.. తక్కువ నూనెతో అద్భుతమైన రుచి!

బగారా రైస్, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కాజు మసాలా!

Big Stories

Advertisement
×