E-Paper
Advertisement

మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!

మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!
Advertisement

Alcohol Addiction: మద్యం అలవాటు ఉన్న చాలామంది మనసులో ఒక బలమైన కోరిక ఉంటుంది. ఎలాగైనా తాగుడు మానేసి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. కానీ, ఎంత ప్రయత్నించినా ఆ అలవాటును వదులుకోలేకపోతుంటారు. ఇదేదో కేవలం మానసిక బలహీనత మాత్రమే కాదు, శరీరంలో మద్యం వల్ల కలిగే తీవ్రమైన డిపెండెన్సీ అని న్యూఢిల్లీలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్’ (ILBS) నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. లివర్ సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

తెలిసినా మారలేని విచిత్రమైన పరిస్థితి..

తాగుడు వల్ల ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నా.. రోగులు దానికే పరిమితమవుతున్నారు. మద్యం వల్ల కాలేయం ఎంతగా పాడువుతుందో తెలిసినప్పటికీ, సుమారు 78 శాతం మంది దాన్ని మానలేకపోతున్నారని రీసెర్చర్లు గుర్తించారు. దీర్ఘకాలంగా మద్యం తాగడం వల్ల మెదడులోని కొన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. దీనివల్ల నచ్చకపోయినా, వద్దనుకున్నా మద్యం వైపే మనసు లాగుతుంది. జ్ఞానం ఉండి, మారాలనే తపన ఉన్నప్పటికీ మద్యం అలవాటును జయించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఈ పరిశోధన చెబుతోంది.

ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అంత మంచిది..

Advertisement

ఒకేసారి తాగుడు బంద్ చేయడం అందరికీ సాధ్యపడదు. గతంలో పదే పదే మద్యం మానేయడానికి ప్రయత్నించిన వారే, కాలక్రమేణా దానికి పూర్తిగా దూరంగా ఉండటంలో సఫలమయ్యారని అధ్యయనం తేల్చింది. అంటే.. ఒకట్రెండు సార్లు విఫలమైనంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన పనిలేదు. పదే పదే ప్రయత్నించడం వల్ల డిపెండెన్సీ తగ్గుతుంది. అంతేకాకుండా.. అనారోగ్యం తీవ్రమైన స్థాయికి చేరినప్పుడు కలిగే భయం కూడా కొందరిలో ఈ అలవాటును పూర్తిగా మానిపించడానికి ఒక బలమైన కారణమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Also Read: ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

అవగాహనకు, చేతలకు మధ్య వ్యత్యాసం..

Advertisement

అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ల కౌన్సెలింగ్ వల్ల తాగుడు దుష్ప్రభావాలపై మంచి అవగాహన వస్తుంది. కానీ, సమాచారం తెలిసిపోగానే ప్రవర్తన మారిపోదు. తీవ్రమైన అడిక్షన్ ఉన్నప్పుడు కేవలం ఆలోచనలు మాత్రమే సరిపోవు. మెదడుపై ఉన్న అదుపు తప్పడం వల్ల రోగులు తాగుడు వైపే మొగ్గుతున్నారు. అంటే.. మద్యం మానడానికి కేవలం వ్యక్తిగత సంకల్పం మాత్రమే కాకుండా, నిపుణుల మానసిక చికిత్స, వైద్యుల సాయం కూడా ఎంతైనా అవసరం.

పిల్లలకు అవగాహన పెంచాలి..

ఈ పరిస్థితిపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. మద్యం అనేది ఒకసారి అలవాటయ్యాక వదులుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు. అందుకే భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ, మద్యం వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వివరించాలి. చిన్నప్పుడే వీటిపై సరైన ఆలోచన కలిగితే, పెద్దయ్యాక వారు ఈ అలవాట్లకు దూరంగా ఉంటారు.

ప్రభుత్వాల కఠిన నిర్ణయాలు చాలా ముఖ్యం..

కేవలం కుటుంబాలే కాకుండా ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. మద్యం అమ్మకాలపై, ధూమపానంపై కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న మద్యపాన నిషేధం వంటి విధానాలను పరిశీలించి, ఇతర ప్రాంతాల్లోనూ వీలైనంతవరకు కట్టుదిట్టమైన నిబంధనలు తేవాలి. అప్పుడే సమాజంలో ఈ రకమైన అలవాట్లను అరికట్టడం సాధ్యమవుతుంది.

Also Read: మెట్టెలు, ముక్కుపుడక కేవలం అలంకారమేనా? ఆడవాళ్లకు వీటిని తప్పనిసరి చేయడం వెనుకున్న కారణాలివే!

Tags

Related News

ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

నోరూరించే బీరకాయ కొత్తిమీర చట్నీ..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

ట్రెడిషనల్ స్టైల్ కట్టే పొంగలి..ఇలా చేస్తే తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

మెట్టెలు, ముక్కుపుడక కేవలం అలంకారమేనా? ఆడవాళ్లకు వీటిని తప్పనిసరి చేయడం వెనుకున్న కారణాలివే!

ఒక్కసారి ఇలా రాయలసీమ మటన్ వేపుడు చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే చేసుకుంటారు!

గోవా స్టైల్ కరకరలాడే రవ్వ ఫిష్ ఫ్రై రెసిపీ.. తక్కువ నూనెతో అద్భుతమైన రుచి!

Big Stories

Advertisement
×