E-Paper
Advertisement

ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!

ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!
Advertisement

Office Habits: ఆఫీస్‌లో మన ప్రవర్తనే మనకు తిరుగులేని గుర్తింపు తెచ్చిపెడుతుంది. చాలామంది కష్టపడి పనిచేస్తారు కానీ, తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కెరీర్‌లో వెనకబడిపోతుంటారు. ప్రమోషన్లు రావాలన్నా, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా పనితో పాటు మన అలవాట్లు కూడా బాగుండాలి. కార్పొరేట్ ప్రపంచంలో లేదా ఏ ఉద్యోగంలోనైనా మిమ్మల్ని అన్‌ప్రొఫెషనల్‌గా మార్చే 5 ముఖ్యమైన అలవాట్లు, వాటిని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పరిమితి దాటి మాట్లాడటం..

ఆఫీస్ మీటింగ్స్‌లో లేదా చర్చల్లో మీ అభిప్రాయాలు చెప్పడం మంచిదే. కానీ ప్రతీ విషయంలో అందరినీ ఆపేసి మీరే ఎక్కువ మాట్లాడటం, ఎదుటివారు చెప్పేది వినకపోవడం వల్ల నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది. మంచి ప్రొఫెషనల్స్ ఎప్పుడూ ఎదుటివారి మాటలను శ్రద్ధగా వింటారు. సరిగ్గా విన్నప్పుడే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి, సరైన సమాధానం ఇవ్వగలుగుతాం.

అన్నిటికీ YES చెప్పడం..

Advertisement

అందరికీ మంచిగా అనిపించాలని ఆఫీస్‌‌లో అడిగిన ప్రతి పనికీ సరే అనడం వల్ల ఇబ్బందులు వస్తాయి. పరిమితికి మించి పనులు తలకెత్తుకుంటే ఏ పని సరిగ్గా చేయలేం. చివరికి డెడ్‌లైన్లు మిస్ అయి క్వాలిటీ తగ్గుతుంది. దీనివల్ల బాస్‌ల దృష్టిలో మీ ఇమేజ్ పాడవుతుంది. కాబట్టి మీ పని సామర్థ్యాన్ని బట్టి నో చెప్పడం, పనులను ప్రాధాన్యత ప్రకారం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Also Read: బాధను కూడా నవ్వుతూ చెప్పేస్తున్న Gen Z.. సోషల్ మీడియాలో ఇదో కొత్త ట్రెండ్!

పర్సనల్ విషయాలు పంచుకోవడం..

Advertisement

సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉండటం అవసరమే. అయితే మీ వ్యక్తిగత జీవితానికి, వృత్తికి మధ్య సరిహద్దులు ఉండాలి. మీ ఇంట్లోని గొడవలు, ప్రేమ విషయాలు, వ్యక్తిగత సమస్యలు ఆఫీస్‌లో అతిగా చర్చించడం సరికాదు. ఆఫీస్‌లో ఎప్పుడూ పనికి సంబంధించి ఆలోచించే వ్యక్తిగానే గుర్తింపు తెచ్చుకోవాలి తప్ప పర్సనల్ డ్రామాలతో వార్తల్లో నిలవకూడదు.

సమయపాలన పాటించకపోవడం..

మీరు ఎంత టాలెంటెడ్ అయినాz.. ఆఫీస్‌‌కు లేదా మీటింగ్స్‌కు ఆలస్యంగా రావడం చాలా పెద్ద పొరపాటు. లేట్‌గా రావడం వల్ల మీకు పనిపై శ్రద్ధ లేదనే సంకేతం వెళ్తుంది. ప్రతీ మీటింగ్‌కు ఓ ఐదు నిమిషాలు ముందే హాజరవ్వడం వల్ల మీరు పనికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుంది. మేనేజ్‌మెంట్ కూడా ఇలాంటి బాధ్యత గల వ్యక్తులకే పెద్ద బాధ్యతలు అప్పగిస్తుంది.

స్పష్టత లేని కమ్యూనికేషన్..

పని ఎంత బాగా చేసినా, దాన్ని సరిగ్గా ఇతరులకు చెప్పలేకపోతే ప్రయోజనం ఉండదు. ఈమెయిల్స్ అరకొరగా రాయడం, విషయాలు స్పష్టంగా చెప్పకపోవడం, అస్పష్టమైన అప్‌డేట్స్ ఇవ్వడం వల్ల ఆఫీస్‌లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. తోటివారితో మాట్లాడేటప్పుడు నేరుగా, స్పష్టంగా, గౌరవంగా విషయం చెప్పడం అలవాటు చేసుకుంటే మీ కెరీర్ చాలా వేగంగా ముందుకెళ్తుంది.

Also Read: ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!

Tags

Related News

ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!

మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!

చెత్తకుండీలు లేకుండానే దేశమంతా క్లీన్.. జపాన్ పరిశుభ్రత సీక్రెట్ ఇదే

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ తినకూడదు

గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఏ గిఫ్ట్ కొనాలా అని టెన్షన్ పడుతున్నారా? 5 బెస్ట్ ఐడియాస్ మీ కోసం

భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!

Big Stories

Advertisement
×