E-Paper
Advertisement

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!

కెప్టెన్ స్మిత్ పుర్రెకు శస్త్రచికిత్స.. విజయవంతంగా నిర్వహించిన సౌదీ వైద్యులు!
Advertisement

Flydubai Pilot: ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు అత్యవసర ఆపరేషన్ ను సౌదీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. దాడిలో పైలట్ పుర్రె ఎముక ముక్కలు కావడంతో.. శస్త్రచికిత్స చేసి పుర్రెను పునర్నిర్మించారు (Skull Reconstruction). అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అబుదాబిలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడుతోందని చికిత్సకు బాగా స్పందిస్తున్నారని వైద్య వర్గాలు తెలిపాయి.

అసలేం జరిగిందంటే?

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లోని తోటి ఓమాన్ కో-పైలట్ ‘గొడ్డలి’ (Crash axe)తో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (38) తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లైట్ ను హైజాక్ చేయాలన్న కో-పైలెట్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. ప్రాణాపాయ స్థితిలోనూ అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి.. కాక్ పీట్ డోర్ ను తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలెట్ ను బంధించారు. ప్యాసింజర్లలో ఇద్దరు పైలెట్లు ఉండటంతో విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు.

పుర్రెకు తీవ్ర గాయం..

Advertisement

కో-పైలట్ హమద్ అల్-హమ్మామీ గొడ్డలితో కెప్టెన్ స్మిత్‌ తలపై దాడి చేయడంతో ఆయన పుర్రె లోపలికి నొక్కుకుపోయింది. తల నుండి తీవ్ర రక్తస్రావం అయ్యింది. పుర్రె ఎముక ముక్కలు కావడంతో పాటు ఛాతి, పొత్తికడుపు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పగిలిన పుర్రె ఎముకలను సరిచేసి.. సౌదీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. పగిలిన స్మిక్ మచ్చార్ పుర్రెను తిరిగి పునర్నిర్మించారు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.

Also Read: శంషాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం బద్దలుకొట్టి రూ.32 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు!

మోదీ, నెతన్యాహూ ప్రశంసలు

Advertisement

దాడి సమయంలో చాకచక్యంగా వ్యవహించి 170 మందికిపైగా ప్రాణాలు కాపాడిన స్మిత్ మచ్చార్ పై ఇటీవల ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. స్వయంగా వీడియో కాల్ చేసి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మీరు ప్రదర్శించిన ధైర్య సాహసాలు చూసి యావత్ దేశం గర్విస్తోందని మోదీ ప్రశించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్ కో-పైలట్ చేసిన కుట్ర చేశారని ఆరోపించారు. కానీ భారత పైలట్ చాకచక్యంగా దానిని తిప్పికొట్టారని కొనియాడారు.

Also Read: అయ్యబాబోయ్ ఆ అద్దంలో డెవిల్ ఉందంట… సీక్రెట్ టెస్ట్ చేయబోతే మైండ్ బ్లాకయ్యే సీన్స్… వైరల్ అవుతున్న హారర్ మూవీ

Tags

Related News

ఆ 5000 మంది ఏమైపోయారు? ఇక వెతకలేక చేతులెత్తేసిన నేపాల్!

ఫ్లైదుబాయ్ కో-పైలట్.. విచారణలో కీలక విషయాలు, షాకైన అధికారులు

కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి, నైజీరియాలో ఘటన

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

Big Stories

Advertisement
×